Sports & Games

Breaking News

మంగ్లీ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

ఆదిలాబాద్ మండలంలోని అంకొలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని  మామిడిగుడా సబ్ సెంటర్ లోని వాన్వట్ గ్రామపంచాయతీ లో చిన్న మంగ్లీ*  గ్రామములో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. 11 కుటుంబాలు కలిగిన ఈ గ్రామం నీకు చేరుకోవాలంటే
 కొండకొనలు, వాగువంకలు,దాటుకుంటూ బురదలో నడుచుకుంటూ 6 కిలోమీటర్లు వెళ్లి వైద్య సిబ్బంది వారికి వైద్య సేవ అందించారు .ఈ వైద్య శిబిరంలో గర్భిణీలకి,పిల్లలకు,ఇంజక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే గ్రామస్టులకు పరిసరాల పరిశుభ్రత పైన అవగాహన కల్పించడం,వ్యక్తిగత పరిశుభ్రత గూర్చి తెలిపి గ్రమస్తులకు బిపి,షుగర్ పరీక్షలు నిర్వహించడం మరియు మలేరియా వ్యాధి పైనా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలని ఇండ్లలో వేపపొగ,దోమ తెరలు వాడలని తెలిపినారు.ఈ కార్యక్రమములో  డాక్టర్ సర్ఫరాజ్, సూపర్ వైజర్ మర్సకొల లక్ష్మీ బాయి, ఆరోగ్య కార్యకర్తలు నల్ల ఈశ్వర్ రెడ్డి,పవర్ ప్రేమ్ సింగ్,రాథోడ్ నారాయణ్,ముయ్యాల మోతి, ఆశాకార్యకర్తలు సుమిత్ర,రుక్మిణి, తూర్పా బాయి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.