డ్వాక్రా మహిళల రిమ్స్ లో క్యాంటీన్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్..
- పారిశుద్ధంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
- సదరం క్యాంప్ పకడ్బందీగా నిర్వహించాలి
- మందులన్నీ అందుబాటులో ఉంచాలి
అదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి):మహిళా శక్తి పథకం కింద మహిళా శక్తి క్యాంటీన్ రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం కొరకు స్థలాన్ని శుక్రవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా పరిశీలించి, DRDO ఆద్వర్యంలో ప్రణాళిక తయారుచేయడం జరిగిందనీ, దీనికి సంబంధించి బ్యాంక్ ద్వారా ఋణం మంజూరు అయిందని, ఫర్నీచర్ కూడా రెడీగా ఉందని ఆన్నారు. ఈ క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి త్వరలో రానున్నారని క్యాంటిన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.సదరం క్యాంప్ ను సందర్శించి ఏవైతే వెయిటింగ్ లిస్టులో ఉన్నాయో ఆ లిస్ట్ కూడా నెలనెలా వారిగా వెయిటింగ్ లిస్టు ఉంచకుండా సదరం క్యాంప్ ద్వారా సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని ఆన్నారు.ప్రభుత్వం ఆదేశాలమేరకు మూడు రోజుల్లో సదరం క్యాంపు అందజేయాలనీ, సదరం సర్టిఫికెట్ వచ్చిన తర్వాత వాళ్లకి పింఛన్ రావడానికి ఆస్కారం ఉంటదని, ముఖ్యంగా ఇక్కడ మెడిసన్ అందుబాటులో ఉండాలనీ, వీటితోపాటు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. Fri day dray day సందర్భంగా శుక్రవారం మహాలక్ష్మి వాడ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలు పై ర్యాలీలో పాల్గొని , ప్రాథమిక పాఠశాల ను సందర్శించిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా.
డెంగ్యూ నివారణ కు సంబంధించి ఎక్కడ కూడా మురికి నీరు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలని అలాగే పగిలిపోయిన కుండలు, పెంకులు గానీ, కొబ్బరి బోండాలు గాని ఎక్కడైనా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలని, అలాగే ప్రతి శుక్రవారం పూల కుండీలు శుభ్రం చేసుకోవాలనీ నీరు నిలువ ఉండకుండా , దోమలు రాకుండా జాగ్రత్త పడాలనీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయ సింగ్ రాథోడ్ జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి వార్ , dyso తదితరులు ఉన్నారు.