Sports & Games

Breaking News

రిమ్స్ లో మందుల కొరత ఎందుకు ఉంది - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

- అధికారులపై మండిపడ్డ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
- రికార్డులను ఎంట్రీ ఎందుకు లేదు 
- మందులు లేకుంటే ముందు జాగ్రత్త పడాలి కానీ ఇప్పుడు అందుబాటులో లేని మందులు రోగులు బయట నుంచి తెచ్చుకోవాలా? 
- ముందు జాగ్రత్త ఎందుకు కొనడటం లేదు మీరు 
- లోకల్ పర్చేస్ కోసం ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా
- ఇబ్బందులు ఉంటే కలెక్టర్కు లెటర్ పెట్టాలి కానీ ఆ పని కూడా మీరు చేయడం లేదు 
- ఫార్మసిస్టులో అధికారులపై కలెక్టర్ ఘనంగారం?
- అధికారుల నిర్లక్ష్యం మే మందుల కొరతకు కారణమా...

ఆదిలాబాద్ రిమ్స్,(ఆరోగ్య జ్యోతి): అదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలోని డ్రగ్ స్టోర్ ను శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా ఇంకేం మందులు అవసరం ఉంది వర్షాకాలం కనుక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ..డైరెక్టర్ డాక్టర్ జయ సగ్ రాథోడ్ మరియు సూపరిండెంట్ డాక్టర్ అశోక్ తో పాటు ఫార్మసిస్టులకు సూచించారు. ఇదిలా ఉండగా రికార్డులు ఎలా రాస్తున్నారు అని ఫార్మసిస్టులను అడగక నోటి నుండి సమాధానం రాకపోవడంతో కలెక్టర్కు డౌట్ వచ్చి అన్ని రికార్డులను పరిశీలించారు. అన్ని రకాల మందులు ఉన్నాయా అని అడగగా సమాధానం రాకపోవడంతో అన్ని రికార్డులు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది కొన్ని రికార్డులను చూపించారు అనంతరం మందులు లేవా అని పక్కవారిని అడగాడం తో బయట నుంచి రాసిచ్చారని చెప్పారు. దీంతో లోకల్ పర్చేస్ ద్వారా మందులు మీరు కొనుగోలు చేయాలి కదా అని సూచించారు. లోకల్ పర్చేస్ కోసం ఆర్డర్ పెట్టామని కానీ మందులు రాలేదని వారు సమాజం ఇవ్వడంతో కలెక్టర్ రాజర్షి షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క పేషెంట్ కూడా బయట నుంచి మందులు తీసుకోవద్దని సూచించారు. ఏదైనా అవసరం ఉంటే తనకు లెటర్ పెట్టాలని కానీ రోగులు మాత్రం ఇబ్బంది పడకూడదని చెప్పారు. రికార్డులు కరెక్ట్ గా లేకపోవడం మందుల ఏమి ఉన్నవి లేనివి అని లేకపోవడంతో కలెక్టర్ అధికారులు మరియు ఫార్మసిస్టులపై కలెక్టర్ కన్నెర్ర చేశారు. ప్రభుత్వం అన్ని రకాల మందులు సరఫరా చేస్తుందని కానీ రిమ్స్ హాస్పిటల్ లో మందులు ఎందుకు లేవని అడిగారు కలెక్టర్... ప్రభుత్వాన్ని బధనా చేసే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు?. సెంట్రల్ డ్రగ్ స్టోర్ రాష్ట్రవ్యాప్తంగా అధికారులు సరఫరా చేస్తున్న మందులు మన ఆదిలాబాద్ కూడా అదే రీతిలో వస్తాయని.. అక్కడ 90 శాతం మందులు లేవు అనే సమాధానం చెప్పడం కరెక్ట్ కాదని.. ఒకవేళ మీరు చెప్పిన సమాధానం వాళ్ళు చెప్పిన సమాధానం పొంతన లేకుంటే ఉండవద్దని తెలిపారు. మంత్రి పర్యటన ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తనిఖీలు చేస్తే పరిస్థితి ఏంటి? రికార్డ్స్ సరిగా లేకపోవడంపై ఆగ్రహించారు?.. లోకల్ పర్చేస్ ద్వారా మందులు కొనుగోలు చేయాలని లేని పక్షంలో కలెక్టర్ పంపించాలని తెలిపారు లోకల్ పర్చేస్ లో మీరు ఆర్డర్ ఇస్తే వెంటనే రావాలి కానీ వారం రోజులు వస్తే రోగులందరూ మందులు బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుందని అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు మరియు ఫార్మాసిస్టులపై ఉందన్నారు.. ఒక్క చిట్టి కూడా బయట వెళ్ళద్దని డైరెక్టర్, సూపరిండెంట్ లకి కలెక్టర్ సూచించారు. కలెక్టర్ రాజర్షి షా  ఆదేశాల మేరకు మార్పు వచ్చిన లేదో వేచి చూడాలి మరి మనం?