317 జీవో తో బదిలీపై వచ్చాము మాకు బదిలీలు చేయండి- నర్సింగ్ ఆఫీసర్స్ విన్నపం
- 317 జీవో బదిలీలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది - హర్షవర్ధన్ రెడ్డి
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఆర్డియూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు టి.పి.సి.సి. అధికార ప్రతినిధి మరియు మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు గాల్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డినీ మంగళమూర్తి బంకెటోల్ ఆదిలాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్స్ రాపోలు శేఖర్ నాగన్నబోయిన రవి, శిరీష, బొద్యాల పద్మ లు కలిసి సన్మానాన్ని చేశారు. ఈ సందర్భంగా 317 జీవోపై తమ అభిప్రాయాన్ని గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి విన్నవించారు. ఈ జీవో ను రద్దు చేస్తూ బదిలీలను చేయాలని విన్నవించారు. వైద్య ఆరోగ్యశాఖలోని ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్స్ గా పని చేస్తున్నామని తెలిపారు. 317 జీవో ప్రకారం బదిలీపై వచ్చామని తెలిపారు. 317 జీవోలో వచ్చిన వారికి బదిలీలు లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నామని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆయంలో 317 జీవో ప్రకారం బదిలీపై వచ్చామని తెలిపారు. ఇప్పటివరకు అధికారులకు నాయకులకు ప్రజాప్రతినిధులకు మంత్రులకు విన్నవించినప్పటికీ ఫలితం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణ బదిలీలను నిర్వహిస్తున్నారని ఇందులో భాగంగా 317 జీవోపై లో బదిలీపై వచ్చిన వారందరినీ బదిలీలు చేయాలని వారు పిఆర్డియూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు టి.పి.సి.సి. అధికార ప్రతినిధి మరియు మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు గాల్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డి నీ కోరినారు. 317 జీవో పై ప్రభుత్వం చర్చిస్తుందని వెంటనే 317 జీవోపై బదిలీలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా పిఆర్డియూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు టి.పి.సి.సి. అధికార ప్రతినిధి మరియు మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు గాల్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డి నర్సింగ్ ఆఫీసర్స్ కి తెలిపారు.