Sports & Games

Breaking News

రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ

అదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి):త్వరలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అదిలాబాద్ జిల్లా లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లో  మహిళా శక్తీ క్యాంటీన్ ప్రారంభించనున్న సందర్భంగా గురువారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా,   జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి తో కలసి ఏర్పాట్లను  పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా మొదటగా  రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లో మహిళా శక్తి ద్వారా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నందున  ఆ ఏర్పాట్లను పరిశీలిస్తూ DRDO సాయన్న కు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, దగ్గరుండి ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ ఆదేశించారు.అనంతరం ఆసుపత్రి ఆవరణ పరిశీలించి, ముఖ్యమంత్రి బస, సమావేశ హాలు, లంచ్, తదితర ఏర్పాట్ల ను TTDC, ఆఫీసర్స్ క్లబ్, పరిశీలించారు.ఈ కార్యక్రమంలో RDO వినోద్ కుమార్, ప్రత్యెక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.