Sports & Games

Breaking News

చర్లపల్లి లో వైద్య శిబిరం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

తలమడుగు,(ఆరోగ్యజ్యోతి): తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జరి సబ్ సెంటర్ పరిధిలో గల చర్లపల్లి గ్రామంలో గురువారం రోజు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో హెచ్ఈఓ చిన్నాన్న, ఏఎన్ఎంలు మని లత, సుమిత, ఆశా కార్యకర్త లలిత, అంగన్వాడీ కార్యకర్త మీనా లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ ఈ ఓ చిన్నాన్న ఆరోగ్య కార్యకర్తలు మనిలత, సుమితాలు మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల జబ్బులు రాకుండా ముందు జాగ్రత్తగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్లనే అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం నీటినిర్వలు ఉండకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు ఆహారాన్ని వేడిగా తినాలని తెలిపారు చేతులు పరిశుభ్రంగా చేసుకొని భోజనం చేయాలని పేర్కొన్నారు. దోమల వల్లనే అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు ముఖ్యంగా మలేరియా డెంగు, అతిసార,డయేరియా తో పాటు అనేక రకాల వ్యాధులు వర్షాకాలంలో వచ్చే ప్రమాదం ఉందని దీనికి ముందు జాగ్రత్తగా పరిసరాల పరిశుభ్రతని పాటించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా చర్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్య చికిత్సలు అందించారు.