Sports & Games

Breaking News

వైద్యశాఖలో తప్పులు తడకగా సీనియార్టీ (జాబితా) లొల్లి? ....

- తప్పు తడకలుగా సీనియార్టీ జాబితాలు !
- అయోమయంలో ఉద్యోగులు !
- ఇష్టం వచ్చినట్టు సీనియారిటీ జాబితా తయారు ..!
- పట్టించుకోని అధికారులు !
- అన్ని క్యాడర్లో అదే రకం !
- సీనియర్లు జూనియర్లుగా జూనియర్లు సీనియర్లుగా జాబితాలో తప్పులు !
- అయోమయంలో ఉద్యోగులు!

తెలంగాణ బ్యూరో (ఆరోగ్యజ్యోతి):వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ డిఎంఈ వైద్య విధాన పరిషత్ శాఖలతోపాటు ఆయా శాఖల్లో సీనియార్టీ జాబితాలు క్యాడర్ వారీగా తయారయ్యాయి. ఈ జాబితాలో అన్ని తప్పులు తడకలు ఉన్నాయని ఉద్యోగులు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి?.. అధికారులు పట్టించుకోవడంలేదని సీనియర్లను జూనియర్లుగా జూనియర్లను సీనియర్లుగా రకరకాలుగా వారికి ఇష్టం వచ్చిన రీతిలో లిస్టులో తయారు చేస్తున్నారని ఫిర్యాదులు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారుల దృష్టికి జాబితాలను తీసుకుపోయినప్పటికీ నిమ్మకు నీ రేపిన విధంగానే అధికారులు స్పందిస్తున్నారని ఆయా కేడర్లకు చెందిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నేడు రేపు కౌన్సిలింగ్ అని కౌన్సిలింగ్ లో అధికారులను కూడా నియమించారు తప్పుతడుకలు ఉన్న వాటికి సరిదిద్దే అవకాశం కూడా లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల ఉద్యోగులు ఆందోళన గురి చెందుతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే ఇష్టం వచ్చిన రీతిలో సీనియార్టీ జాబితాలను తయారు చేశారు జోనల్ జాబితా అని ఒకటి మల్టీ జోన్ అని ఒకటి సీనియార్టీ ఉన్న వారి వీళ్లిట్లో రావడం లేదని జూనియర్ లిస్ట్ లో వస్తున్నాయని రకరకాల ఆరోపణలు ఆందోళనలను ఉద్యోగులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కరెక్షన్ కు సమయం లేకుండా చేస్తుంది. కనీసం ఉద్యోగుల సీనియార్టీ చూయిద్దామన్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇదెక్కడి బదిలీ రా బాబు సీనియార్టీలో తప్పు తడకలు ఉన్న సర్దుకపోతున్నారే తప్ప సరిదిద్దే మార్గాన్ని గురించి ఎవరు ఆలోచించడం లేదని ఉద్యోగుల ఆందోళన. న్యాయంగా రావాల్సిన సీనియార్టీ అన్యాయంగా తొలగిస్తున్నారని ఫిర్యాదులు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ చాలామంది ఉద్యోగుల్లో నిరాశ ఈ బదిలీలు నెలకొన్నాయి.