"విజయమ్మ "నీకు వందనం.. ప్రాణాలు అరచేతిలో వాగులు దాటుతూ విధులకు విజయమ్మ
ఇంద్రవెల్లి (ఆరోగ్యజ్యోతి): ఇంద్రవెల్లి మండలంలోని పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వాల్గొండ సబ్ సెంటర్ వాజ్గోమ్ గ్రామపంచాయతీ పరిధిలోని జెండా కూడా గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఊరుకు వెళ్లాలంటే వాగులు వంకలు దాటుతూ కొండలు కోణాలు దాటాల్సిందే. ఆరోగ్య కార్యకర్త విజయ సుందరి సి హెచ్ డబ్ల్యు అనసూయ లో వాగులు వంకలు దాటి ప్రాణాలకు తెగిస్తూ విధి నిర్వహణలో భాగంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రవహిస్తున్న వాగు దాటటానికి ఓపక్క వ్యాక్సిన్ క్యారియర్ మరోపక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగు దాటుతూ వెళ్లారు. అంతేకాకుండా అడవిలో బుట్టలు ఎక్కుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది సమాజసేవ అంటే ఇదేనేమో మరి.. జిల్లా స్థాయి ఉన్నత అధికారులు ఇలాంటి వారి సేవలను గుర్తించి 15 ఆగస్టు లేదా 26 జనవరి కి ఇలాంటి వారికి అవార్డులు ప్రధానం. ఉన్నత అధికారులు ఇలాంటి సేవా భవం కలిగిన వారిని గుర్తించి అవార్డు ప్రధానం చేయాలి .