నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే క్రమబద్దీకరించాలి
జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రమణ్యం
తెలంగాణ బ్యూరో (ఆరోగ్యజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్ హెచ్ ఎం) పనిచేస్తున్న డాక్టర్లను ఏ మాదిరిగా రెగ్యులరైజ్ చేశారో.. అదే మాదిరిగా మిగతా ఎన్ హెచ్ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగులందరిని కూడా క్రమబద్ధీకరించాలన్నారు. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో 23 జూలై 2024 ప్రారంభిస్తున్నారు. కావున మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొంటారు వారికి కావలసిన కనీస వేతనాలు ఇవ్వకుంటే మాత్రం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని ప్రభుత్వవని ఉద్యోగులు హెచ్చరించారు.. పోయిన సంవత్సరం 2023 ఆగస్టు 31 తారీకు నుండి సెప్టెంబర్ 13వ తారీకు వరకు అనగా 14 రోజులు సమ్మెలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు సమ్మె లో పాల్గొన్నారు .ఆ సమ్మె కాలపు వేతనాలు కూడా అప్పటి ప్రభుత్వ అధికారులు సమ్మెకు వేతనం ఇస్తానని చెప్పారు అదికూడా కొంతమందికే వచ్చేది మరి ఇంకా కొంతమందికి రాలేదు. అది కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. త్వరలో డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ముందట జాతీయ ఆరోగ్య మిషన్ లో తెలంగాణలో 17, 514 మంది ఆల్ క్యాడర్స్ పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ధర్నా కార్యక్రమం లో ఉద్యోగుల యువ నేత మురళి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనునట్లు తెలిపారు . పీ.ఆర్.సీ ఏరియర్స్ 7నెలలు గత ప్రభుత్వం రిలీజ్ చేయాలని వారు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్ వి కర్ణ చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు పి ఆర్ సి ఏరియర్స్ గానీ మరియు క్యాడర్ ఫిక్సేషన్ చేయలేదు కావున ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు..
గత ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. గతంలో 510 జీవోలో కొంతమందికే వేతనాలు పెంచింది బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం ఇంతవరకు సవర్ణ చేయలేదు ఏడు సంవత్సరాలవుతుంది 510 వచ్చి ఇప్పటికీ కానీ 4000 మందికి అన్యాయం చేసింది ఆ 510 జీవో కాపీలో కావున వారందరికీ కనీస వేతనం అమలు అయ్యేటట్టుగా చూసి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగల బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉద్యోగులందరిని ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని , హెల్త్ కార్డ్స్ హెచ్ ఆర్ డి ఏ పాలసీ ఈక్వల్ టు గ్రాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు.