Sports & Games

Breaking News

రెండు కిలోమీటర్లు బురదలో నడుస్తూ వైద్య సేవలు

ఇచ్చోడ,(ఆరోగ్య జ్యోతి): ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నారాయణపూర్ జీపీలోని రాజుల గూడలో వైద్య సిబ్బంది బురద రోడ్డులో రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గ్రామస్థులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వైద్య సేవలు ఎలాగైనా అందించాలని ఉద్దేశంతో సిబ్బంది సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో బురదలో నడుస్తూ వైద్య సేవలు వర్షాకాలం కావడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఇమ్మనైజేషన్ తోపాటు వర్షాకాలం వచ్చే వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు గ్రామంలో12 మంది రక్తం నమూనాలు సేకరించి, 95 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. గర్భిణీలు, బాలింతలకు రోగ నిరోధక టీకాలు వేశారు. హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కృష్ణ, ఏఎన్ఎం రేణుక, సిబ్బంది పాల్గొన్నారు.