భీంపూర్ పి హెచ్ సి లో గర్భిణీలకు వైద్య పరీక్షలు
భీంపూర్ (ఆరోగ్యజ్యోతి):ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీంపూర్ యందు "గిర్గాం" ఉపకేంద్రం గ్రామాల 21గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు చేసి గర్భిణీ స్త్రీలకు అవసరమైన వివిధ రకాల రక్తపరీక్షలు కూడా నిర్వర్తించడం జరిగిందని, సలహాలు సూచనలు తీసుకోవడం జరిగిందని,అందరికి సంపూర్ణ పోషకాహారం గూర్చి,అనుబందపోషకాహారం ను సంబందిత అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రతి గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని, సమయానుకూలంగా నిర్వర్తించే పరీక్షలగూర్చి,వివిధ రకాల నిత్యం నిర్వర్తించే మామూలు పనులతో పాటు,7వ నెలలో నుండి మన ఆరోగ్య శాఖ తెలిపిన మామూలు వ్యాయామాల చేయడం వల్ల సురక్షిత కాన్పులు కావడానికి అవకాశం ఏర్పడుతుందని, సురక్షిత కాన్పులు కావడం కోసం తప్పకుండా మన ఆసుపత్రి సేవలు వినియోగించు కోవాలని కోరడమైనది, అదేవిధంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు మొదటి కాన్పు ఐన వారు కాన్పుకు, కాన్పుకు మధ్య కనీస వ్యవధి కోసం తాత్కాలిక పద్దతులను నిరోధ్,ఓరల్ పిల్స్,కాపర్-టీ,అంతర ఇంజెక్షన్ లను వినియోగించాలని అందుకు మీ మీ ఆశా కార్యకర్తలను గాని ఆరోగ్య కార్యకర్తలను గాని సంప్రదించాలని సూచించారు,ఇద్దరు పిల్లల తర్వాత శాశ్వత కుటుంబనియంత్రణ పద్దతులైన వ్యాసెక్టమి గాని,ట్యూబెక్టమిని గాని శస్త్రచికిత్సలు చేయించుకోవాలని,3- ప్రమాదభరిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి తగు జాగ్రత్తలు సూచించడమైనదని మండల వైద్యాధికారి డా" నిఖిల్ రాజ్,మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ లు తెలిపారు, ఈకార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, పర్యవేక్షకులు జి.మేఘ, స్టాఫ్ నర్స్ పూర్ణిమ,యం.యల్.హెచ్.పి జి.సంద్యారాణి,సంబంధిత ఆశా కార్యకర్తలు సంగీత, శకుంతల, ఇందిర,రణిత, సిబ్బంది రేఖ,శంకర్ పాల్గొన్నారు.