వర్షాకాలం వ్యాధులపై అవగాహన
భీంపూర్ (ఆరోగ్యజ్యోతి): వర్షాకాలం దృష్ట్యా ముందస్తూ ప్రణాళికలలో బాగంగా ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీంపూర్ పరిధిలోని అన్ని గ్రామాలలో "ప్రైడే-డ్రైడే" "జాతీయ కీటక జనిత ఆరోగ్య అవగాహన కార్యక్రమం"మరియు వైద్య శిబిరం "టేకిడిరాంపూర్" గ్రామంలో నిర్వహించి 34 మందిని పరీక్షించి మందులను అందచేయడం జరిగిందని, క్లోరినేషన్ చేసిన నీటిని,గాని కాచి చల్లార్చిన నీటిని త్రాగడానికి వినియోగం చేయాలని,వేడి,వేడి ఆహారపదార్థాలను బుజించాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని,నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని,నిల్వ నీటిపై మూతలను ఉంచాలని, ఆంటి లార్వల్ రసాయనాన్ని మురికి నీటి, మంచినీటి నిల్వలపై పిచికారి చేయించడం జరిగిందని,జ్వరం, నీళ్ళ విరేచనాలు వచ్చిన వెంటనే ఆశా కార్యకర్తలను, ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించి పరీక్షలు చేయించుకోని వైద్యాధికారి సూచనలతో మందులను సక్రమంగా వినియోగించుకోవాలని మండల వైద్యాధికారి డా" నిఖిల్ రాజ్, మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ లు తెలిపారు ఈకార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, పంచాయతి సెక్రటరీ విజయ్ కుమార్,ఆరోగ్య కార్యకర్తలు డి.సుజాత,గోదావరి ఆశా కార్యకర్తలు గుణాదేవి, సీతాబాయ్,దృపధ,దేవుబాయ్,రోజా,పద్మ,విమల,స్వప్న,సంగీత,అనుసూయ,సాజిద ,కవిత,సంబంధిత అన్ని గ్రామాల ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్త అర్చన ,గ్రామ పంచాయతీ సిబ్బంది మారుతి ,చింతావర్ పాల్గొన్నారు.