317 జీవో అమలుచేస్తూ- బదిలీలకు ముందుగా పదోన్నతులు ఇవ్వండి టీవీవీపీ కార్యదర్శి బైరపాక శ్రీనివాస్*
హైదరాబాద్,(ఆరోగ్య జ్యోతి):బదిలీల్లో తమకు అవకాశం లేకుందుపోతుడని తెలంగాణ వైద్య విధాన పరి షత్తు(టీవీవీపీ)లోని జిల్లా క్యాడర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీవీవీపీ పరిధిలో 317 జీవో అమలుకు ప్రభుత్వం గత జూలైలో ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు మల్టీజోన్, జోనల్ పోస్టులైన వైద్యులు, స్టాఫ్ నర్సులు ,పారా మెడికల్ మరియు ఇతర సిబ్బందికి ఆ జీవో అమలైంది, కానీ,జిల్లా స్థాయిలోని ల్యాబ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్లు, ఎం.ఎన్. ఓ., థియేటర్ అసిస్టెంట్, డార్క్ రూం అసిస్టెంట్, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 35 క్యాడర్లు అమలు కాలేదు. దీంతో ప్రస్తుత బదిలీల్లో తమకు అవకాశం రాలేదని టీవీవీపీ కార్యదర్శి ( సిఐటీయు) బైరపాక శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటివరకు మూడు నాలుగు జిల్లాల్లోనే ప్రక్రియ పూర్తయిందన్నారు. దీనిపై కలెక్టర్లను అడిగితే....317 జీవో అమలైనవారికే బదిలీలుంటాయని చెప్తున్నారని, సంబంధిత మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ , వైద్య విధాన పరిషత్ కమీషనర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని టీవీవీపీ కార్యదర్శి బైరపాక శ్రీనివాస్ ఒక ప్రకటన లో కోరారు.