ఈనెల 21న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమావేశం
కొమరం భీమ్ ఆసిఫాబాద్,(ఆరోగ్య జ్యోతి):ఈనెల 21 న మధ్యాహ్నం 1 గంటకు ఎన్.హెచ్.ఎం. ఆల్ క్యాడర్స్ ఏస్.టీ.యు.భవన్ ఆసిఫాబాద్ జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని జాతీయ ఆరోగ్య మిషన్ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు భోగి ఉపేందర్ ప్రధాన కార్యదర్శి గుడిపల్లి మధుకర్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా NHM కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ (ఏఐటీయుసీ) రాష్ట్ర అధ్యక్షులు ఎం.నరసింహ , NHM కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఎన్ హెచ్ ఎం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎల్.సురేష్ నాయక్ , జనగాం జిల్లా ఆల్ క్యాడర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కొండ్ర లత ,NHM కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ దేవనబోయిన బాపు యాదవ్ పాల్గొంటున్నారనీ వారు పేర్కొన్నారు.