ముఖ్యమంత్రికి ఆర్ఎంపీ పిఎంపి వైద్యుల ధన్యవాదాలు
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎంపీ పి.ఎం.పి లకు సంబంధించిన పరామెడికల్ బోర్డు ట్రైనింగ్ ఇచ్చేందుకు పర్మిషన్ ఇచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ జిల్లా ఆర్ఎంపి పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భీముడు ప్రధాన కార్యదర్శి ఎస్ నరసింహులు ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆర్ఎంపీ పిఎంపి వైద్యులకు ప్రత్యేక శిక్షణ నుంచి సర్టిఫికెట్లు ప్రధానం చేశారన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆర్.ఎం.పి పిఎంపీలను మర్చిపోయారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను లోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎంపి పిఎంపి వైద్యులను గుర్తించారని తెలిపారు. మంగళవారం రోజు జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆర్ఎంపి పిఎంపి వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ప్రధానం చేయడం అనడం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆర్.ఎం.పి పిఎంపి వైద్యులందరి సంతోషపడ్డారని తెలిపారు. ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యులు గిరిజన మాం రుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో మురికి వాడల్లో పనిచేస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని వారు పేర్కొన్నారు అలాంటి ఆర్.ఎం.పి పిఎంపి వైద్యులను గుర్తించడం ఎంతో సంతోషకరంగా ఉందని వారు తెలిపారు. అంతేకాకుండా అర్థాంతరంగా ఆగిపోయిన కమ్యూనిటీస్ ట్రైనింగ్పురం పునర్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఆర్.ఎం.పి పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకన్న ప్రధాన కార్యదర్శి కే బాలరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి ఆర్ఎంపీ సమస్యలను తీసుకువెళ్లడం జరిగిందని దీని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ట్రైనింగ్పురం పునర్ ప్రారంభించాలని తెలిపినట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్ఎంపి పిఎంపి వైద్యులను గుర్తించినందుకు గాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ,ధనసరి అనసూయ సీతక్క, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ముఖ్యమంత్రి సలహాదారులు నరేందర్ రెడ్డి లకు ఆదిలాబాద్ ఆర్ఎంపీ పి.ఎం.పి అసోసియేషన్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రకాంత్, డాక్టర్ జై కిస్తూ, డాక్టర్ రాజన్న, డాక్టర్ బిస్వాస్ నారాయణ, డాక్టర్ దేవిదాస్, డాక్టర్ సాదిక్ బాబా, డాక్టర్ పరుశురాం, డాక్టర్ సోమన్న, డాక్టర్ కుమార్ గౌరవ్, డాక్టర్ విజయ్, డాక్టర్ అనిల్, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ విజయ్, తదితరులు పాల్గొన్నారు.