-Editor K. Naresh Kumar 9848025451
- ఆనందంలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రోడ్డు సచివాలయంలో తెలంగాణ ఆయా జిల్లాల్లో పనిచేసిన కలెక్టర్లు మంత్రులు ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య సేవలను అందించడంలో తెలంగాణ అధికారులందరూ ముందుండాలని తెలిపారు. అవసరమైతే రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థల సేవలను కూడా వైద్య ఆరోగ్య శాఖ వినియోగించుకోవాలని సూచించారు. గత కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల గురించి అధికారులు ప్రజాప్రతినిధులు మర్చిపోయారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం స్వచ్ఛంద సంస్థల సేవలను ఆరోగ్యం కోసం వినియోగించుకోవాలని చెప్పడం స్వచ్ఛంద సంస్థలో ఊపిరి నింపినట్లు అయింది. గత కొన్ని సంవత్సరాల్లో గా స్వచ్ఛంద సంస్థలను గత ప్రభుత్వం మర్చిపోయింది కానీ ఈ ప్రభుత్వం స్వచ్ఛంద సేవలను గుర్తించడం స్వచ్ఛంద సంస్థ సేవకులు అందించే వారు ఆనందం మునిగిపోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం స్వచ్ఛంద సేవ సంస్థల కు ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని తెలుస్తుంది కొన్ని పెద్ద పెద్ద సంస్థలకు మాత్రమే సహాయ సహకారాలు అందించారని ఆరోపణలు ఉన్నాయి అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ గురించి మాట్లాడే సమయంలో స్వచ్ఛంద సంస్థల సేవలను కూడా అవసరమైతే వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నూట ఆ మాట రావడంతో స్వచ్ఛంద సంస్థలకు ఒక్కసారిగా ఊపిరి వచ్చినట్లయితే పది సంవత్సరాలుగా చిన్న పెద్ద స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రాజెక్టు లేకపోవడం ఇప్పుడు ముఖ్యమంత్రి నూట స్వచ్ఛంద సంస్థల మాట రావడంతో రాబోయే రోజుల్లో స్వచ్ఛంద సంస్థలకు ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.