Sports & Games

Breaking News

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సేవలు అందించడంలో ముందుండాలి

- కలెక్టర్ల సమావేశంలో ముఖ్య మంత్రి
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి):ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రేషన్‌కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డు లింకు పెట్టొద్దనీతెలంగాణలో అందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలనీ అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లందరూ ఆరోగ్య పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు ప్రజా ఆరోగ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలు చేపడుతుందని వీటిని పక్క బంద్ గా అమలు చేసేందుకు కలెక్టర్లు కృషి చేయాలి అన్నారు ఆరోగ్య పథకాలు అమలు చేయడంలోనే కలెక్టర్ పాత్ర కీలకమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రతి ఒక్కరి డిజిటల్‌ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాల నీ దీని ద్వారా ప్రజలు అనారోగ్య బారిన పట సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు డిజిటల్ కార్డు ద్వారా ఎన్నో రకాల వైద్య సేవలు పొందే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు.
ఆర్‌ఎంపీలు, పీఎంపీల ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
రూరల్‌ వైద్యులను ప్రోత్సహించేలా ఎక్కువ పారితోషికం పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ప్రజా ఆరోగ్యంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజలకు ఎక్కువ వైద్య సేవలు అందవలసి ఉంటుందని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్యాల బారిన పడితే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మొదటగా వెళ్తారని అక్కడి నుంచి వైద్యుడు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన అనంతరం పెద్ద ఆసుపత్రికి పంపిస్తారని తెలిపారు అందుకు గ్రామీణ వైద్యం కీలకమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో ఉన్న ప్రతీ బెడ్‌కు..
సీరియల్‌ నెంబర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు బెడ్ బెడ్ కు నంబరు ఉండడం వల్ల రోగికి వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.
గిరిజనులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలనీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు గిరిజనల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన అవసరం అందరిపై ఉందని తెలిపారు ముఖ్యంగా పల్లె వైద్యంపై ప్రత్యేక దృష్టి వహించాలని పేర్కొన్నారు గిరిజన గ్రామీణ తాండాలలో గిరిజనులకు వైద్య సేవలు అందించడంలో ఆరోగ్య కార్యకర్తలకు కీలక పాత్రాన్ని ఆయన పేర్కొన్నారు. అనారోగ్యల బారిన పడ్డ వెంటనే గిరిజనులు ఎక్కువ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేయాలని ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందించాలని తెలిపారు అవసరమైతే పెద్ద ఆసుపత్రికి పంపాలని పేర్కొన్నారు ఎందుకుగాను జిల్లా కలెక్టర్లు కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వైద్యులకు వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు.ఆస్పత్రుల మెయింటెనెన్స్‌ కోసం..ప్రత్యేక వ్యవస్థ ఉండేలా కలెక్టర్లు చూడాలనీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడీ కలెక్టర్లకు సూచించారు. . ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టివిక్రమార్క తోపాటు మంత్రివర్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.