ఆర్ఎంపీలను గుర్తించిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ ఎంపీపీ ఎంపీ గ్రామీణ వైద్యులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలని తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలంగాణ కమ్యూనిటీ పరామెడికల్స్ వైద్యుల ఐక్యవేదిక సంఘం అధ్యక్షులు ఉక్కుల అశోక్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను గుర్తించి ఆర్ఎంపీ పి.ఎం.పిల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారని అందుకు ముఖ్యమంత్రిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యులు చేస్తున్న సేవలను వారి కష్టాలను గుర్తించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో ఆ ఆర్.ఎం.పి పిఎంపి వైద్యులకు శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చారని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చే సర్టిఫికెట్లు జారీ చేయాలని తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎంపి పిఎంపి వైద్యులందరూ ఆర్ఎంపీలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.