Sports & Games

Breaking News

మహారాష్ట్రలో జికా వైరస్ కలకాలం

అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో జికా వైరస్ కేసులు నమోదుకావటంతో కేంద్రం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, ముఖ్యంగా గర్భిణు లకు పరీక్షలు జరపటంపై దృష్టిసారిం చాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. బుధవారం ఈ మేరకు అడ్వైజరీ జారీచేసింది. దోమల బెడద లేకుండా ప్రాంగణాలను పర్యవేక్షించ డానికి, దోమల నివారణ చర్యలు చేప ట్టేందుకు ఓ నోడల్ అధికారిని నియ మించాలని సూచించింది. డెంగ్యూ, చికెన్ గున్యా మాదిరి జికా వైరస్ కూడా ఏడిస్ రకం దోమల ద్వారా మనుషు లకు సోకుతుంది. గర్భిణులకు ఈ వైరస్ సోకితే, వారికి పుట్టే పిల్లల్లో మెదడు ఎదుగుదల (మైక్రోసిఫాలే) దెబ్బతింటుంది. అంతేగాక బాధిత శిశు వుల్లో నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.