పి హెచ్ సి లో నర్సుల కొరత
నేరేడుచర్ల : నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్లో కొరత వేధి స్తోంది. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ముగ్గురు నర్సులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్క స్టాఫ్ నర్స్ మాత్రమే ఉండడం వల్ల రోగు లకు సేవలు సక్రమంగా అందడం లేదు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని బాలికా సంరక్షణ కేంద్రంగా గుర్తించబడి 24గంటలు గర్భిణులకు సేవలు అందించాల్సి ఉంది. ఇక్కడ ప్రసవాలు కూడా జరుగుతుండడంతో ఒకే నర్స్ సేవలందించ డంలో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నేరేడు చర్ల పీహెచ్సీకి మరో ఇద్దరు స్టాఫ్ నర్సులను నియమించాలని, సక్రమంగా వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.