Sports & Games

Breaking News

అత్యవసర వైద్యం!

ఆసుపత్రుల మ్యాపింగ్కు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం 

హైదరాబాద్: ప్రజలకు సత్వరం అత్యవసర వైద్య సేవలుఅందేలా వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ వైద్య వసతులను మ్యాపింగ్ చేయ నుంది. భవిష్యత్తులో ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ వైద్య వసతి ఉండాలనే ప్రణాళిక నేపథ్యంలో ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమం చేపట్టింది. ఈ బాధ్యతను వైద్య, ఆరోగ్య శాఖ.. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనసంస్థ(టీజీఎంఎస్ఐడీసీ)కి అప్పగిం చింది. అత్యవసర వైద్య సేవలు అందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బం దులను ఈ సందర్భంగా ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావే శంలో ఈ అంశంపై సమీక్షించారు. త్వరితగతిన మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ గ్రామానికి ఏ వైద్య వసతి ఎంత దూరంలో ఉందో గుర్తించడంతోపాటు ఆ ఆసుపత్రిలో వసతులు వంటివా టిని మ్యాపింగ్ లో భాగంగా విశ్లేషించనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. మారుమూల ప్రాంతాలు.. ప్రధానంగా గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందడంలో ఎదురవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుంటోంది.