Sports & Games

Breaking News

ప్రజా ఆరోగ్య విభాగం రద్దు?..

.» సెకండరీ హెల్త్కేర్ డెరెక్టరేట్ పరిధిలోకి తెచ్చే ఆలోచన

» సబ్సెంటర్స్ అన్నీ కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలోకి

» సర్వీస్ నిబంధనలూ వేర్వేరుగానే.. పదోన్నతుల పరంగా సమస్యలు రావా?

హైదరాబాద్, (ఆరోజ్యోతి): రాష్ట్ర ప్రజా రోగ్య విభాగాన్ని (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్-డీహెచ్) రద్దు చేసే యోచనలో సర్కారు ఉంది. ఇప్పటికే తెలం గాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) విభాగాన్ని రద్దు చేసి ఆ స్థానంలో సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ను తెచ్చేందుకు సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రజారోగ్య విభాగాన్ని సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ పరిధిలోకి తేవాలని భావిస్తోంది. తమిళనాడు. లాంటి రాష్ట్రాల్లో వైద్యవిధాన పరిషత్ వ్యవస్థను సెకం డరీ హెల్త్కేర్ డైరెక్టరేట్ పరిధిలోకి తీసుకువచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో మూడు హెచ్ వోడీలకు బదులు డీఎంఈ, సెకండరీ హెల్త్కేర్ విభాగాలే ఉన్నాయి. అటు వంటి రాష్ట్రాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికా రుల బృందాన్ని పంపించి అధ్యయనం చేయించే ఆలో చన చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామో దర రాజనర్సింహ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖలో నాలుగు కీలక విభాగాలున్నాయి.. వైద్యవిద్య సంచాలకులు (డీఎంఈ) పరిధిలో మెడికల్ కాలేజీలున్నాయి. టీవీవీపీ కింద సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు న్నాయి. ఇక మూడోది ప్రజారోగ్య సంచాలకులు, డీహె చ్ పరిధిలో సబ్సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు న్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యాన్ని మొత్తం చూసేది డీహెచ్ విభాగమే. ఇక నాల్గోది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం. ఈ నాలుగింటిలో ఒకదాన్ని (డీహెచ్)ను పూర్తిగా రద్దు చేసి, కేవలం మూడింటినే ఉంచాలను కుంటోంది. ఇక క్షేత్రస్థాయిలో ఉండే సబ్ సెంటర్స్ అన్నింటిని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలోకి తీసుకురానుంది. ఇప్పటికే సబ్ సెంటర్స్. అన్నింటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా మార్చారు.. అక్కడ పనిజేసే వైద్య సిబ్బంది అందరికీ ఇచ్చే వేతనా లన్ని కూడా ఎన్హెచ్ఎమ్ నిధులే. దాంతో క్షేత్రస్థాయి సబ్ సెంటర్స్ అన్నీ కమిషనర్ పరిధిలోకి వెళ్తాయి. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రు లన్నీ సెకండరీ హెల్త్కేర్ డైరెక్టరేట్ పరిధిలోకి వస్తా యన్న మాట. అయితే ప్రజారోగ్య విభాగాన్ని పూర్తిగా రద్దు చేసి.. దాన్ని సెకండరీ హెల్త్కేర్ డైరెక్టరేట్ పరిధి లోకి తీసుకురావడం అంత తేలిక కాదని వైద్య నిపు ణులు చెబుతున్నారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పరిధిలో పనిజేస్తున్న వైద్య సిబ్బందికి ట్రెజరీ ద్వారా కాకుండా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వేతనాలు వస్తు న్నాయి. డీహెచ్ పరిధిలోని వైద్య సిబ్బంది అందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు అందుతున్నాయి. వీటికి తోడు ఇరు విభాగాలకు చెందిన సర్వీస్ రూల్స్ వేర్వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. సర్వీస్ రూల్స్ విరుద్ధంగా ఉండటం వల్ల వైద్యులు, స్టాఫ్ నర్లు, ఇతర పారామెడికల్ సిబ్బంది పదోన్నతులు, వేతన సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.