Sports & Games

Breaking News

అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ ని అకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ

గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్. యశస్వినీ*

వరంగల్,(ఆరోగ్య జ్యోతి):అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ను వర్ధనపేట్ డిప్యూటీ డీ.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్.ఎన్.గోపాల్ రావు విజిట్ చేసారు. గర్భిణీ స్త్రీలకు పరీక్షలు తగు సలహాలు సూచనలు రక్తపరీక్షలు, ఆరోగ్య సలహాలు మందుల పంపిణీ చేయడం జరిగిందని సంపూర్ణ పోషకాహారం ప్రాధాన్యత కాన్పుల కాన్పుల మద్య వ్యవధి కోసం తాత్కాలిక పద్దతులైన నిరోధ్ పిల్స్ ఇంజెక్షన్ గాని ఉపయోగించుకోవాలని తద్వారా తల్లి పిల్లల ఆరోగ్యం మెరుగుపడి ఆరోగ్యంగా మానసికంగా ఆర్థిక పరంగా ఎదుగుదలకు తోడ్పడుతుందని  కుటుంబ సంక్షేమ కార్యక్రమంలో ఈ విధంగా మాతా శిశు సంరక్షణ చేయడం జరిగుతుందని ఎం.జీ.ఎం.హాస్పిటల్ అర్బన్ ఫామిలీ వెల్ఫేర్ సెంటర్ సిబ్బందితో సకాల పరీక్షలు వారు తెలిపిన ఆరోగ్య అవగాహనను పాటించాలని అనుబంధ పోషకాహారంను సంబంధిత అంగన్వాడీ కార్యకర్తల నుండి తీసుకోవాలని పౌష్టిక ఆహారం గుడ్లు , పాలు , బాల అమృతం మొదలైన వాటిని తీసుకోవడం వల్ల బిడ్డ సురక్షితంగా ఉంటుందని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్. యశస్విని ,  స్టాఫ్ నర్స్ భాగ్యలక్ష్మి, ఏఎన్ఎంలు సులోచన, మేరీ,  ఆశాకార్యకర్తలు సంద్యా, అనిత, మరియా తదితరులు పాల్గొన్నారు..