26న చలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల అసెంబ్లీ జయప్రదం చేయండి
ఏ.ఐ.టీ.యూ.సీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి):శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ 26న ధర్నా ఏ.ఐ.టి.యూ.సి ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల సాధనకై నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏ.ఐ.టీ.యూ.సి ఉప ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. నరసింహ మరియు కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పిలుపునిచ్చారు. మంగళవారం యూనియన్ ఎన్ హెచ్ ఎం ప్రతినిధులతో చర్చ కార్యక్రమం ఫోన్లో నిర్వహించడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ ఎన్హెచ్ఎంలో వివిధ బాగాల్లో 78 క్యాడర్స్ లో పని చేస్తున్న ఉద్యోగులను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటునన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారం కొరుతూ 26-07-2024 చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామని, జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ 23 వ తేదీన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో మనకు బడ్జెట్ కేటాయించలేదు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరు కవాలని ఆయన కోరారు