Sports & Games

Breaking News

నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా బోగే ఉపేందర్


*NHM ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడుగా బోగే ఉపేందర్*

జాతీయ ఆరోగ్య మిషన్(NHM) ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) జిల్లా అధ్యక్షుడు గా గోలేటికి చెందిన AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ని ఎన్నుకున్నట్లు NHM యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రోజున ఆసిఫాబాద్ లో జరిగిన జిల్లా 2వ మహాసభల్లో ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా NHM ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బోగే ఉపేందర్ మాట్లాడుతూ నా పై నమ్మకంతో రెండోసారి జిల్లా అధ్యక్షుడు గా నియమించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై NHM ఉద్యోగుల హక్కులకై పోరాటం చేస్తామని అన్నారు,NHM సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం,కనీస వేతనం 26,000,ఈఎస్ఐ,పిఎఫ్,గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్,మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు,భీమా 25లక్షలు, దురదృష్ట వసతు ఎవరైనా మరణిస్తే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,ఒకటవ తేదీన జీతం చెల్లించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు..