రిమ్స్ లో ఆపరేషన్ సక్సెస్
. ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అన్ని విభాగాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. బుధవారం సూపర్ స్పెషాలిటీ ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించిన మొదటి క్రేన్యాటమి శస్త్ర చికిత్సను వైద్యులు విజ యవంతం చేశారని డైరెక్టర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. పట్టణానికి చెందిన రోహన్ అనే యువకుడు గత నెల 22న ద్విచక్ర వాహనంపై వెళ్తూ కింద పడటంతో తలకు బలమైన గాయాలు అయ్యాయని వెంటనే ఆయనను రిమ్స్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. వైద్యులు అన్ని రకాలుగా పరీక్షించిన అనంతరం న్యూరో డిపార్ట్మెంట్కు పంపించారని ఈ సందర్భంగా డైరెక్టర్ తెలిపారు. దీంతోరిమ్స్ లో చికిత్స నిమిత్తం చేరగా వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయి, తల ఎముకలు దెబ్బతిని ఆయన పరిస్థితి ప్రమాదంగా మారినట్లు వారుగుర్తించారని అన్నారు. వెంటనే ప్రత్యేక న్యూరాలజీస్ట్ డాక్టర్ విజయ మోహన్ రాజు ఆధ్వర్యంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారని పేర్కొన్నారు. అనంతరం శాస్త్ర చికిత్స చేయడంతో బాధితుడు కోలుకొనిడిశ్చార్జ్ అవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే బాధితుడు రోహన్ కు రిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగాశాస్త్ర చికిత్స చేయడం జరిగిందని, కేవలం 10 రోజుల్లో పే పేషెంట్ కోల్పోవడం జరిగిందని తెలిపారు ఇది రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుల ఘనత అని డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాంటి శాసన చికిత్సకు 3నుంచి 5 లక్షల వరకు ఖర్చుఅయ్యేదని తెలియజేశారు. అనంతరం న్యూరాలజీస్ట్ డాక్టర్ విజయ మోహన్ రాజు మాట్లాడుతూ ఫిట్స్ రావడంతో ఆయన కోమాలోకి వెళ్లే పరిస్థితి ఉందని అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయకు శాస్త్ర చికిత్స అవసరమని తెలిపారు. శాస్త్ర చికిత్స చేసిన అనంతరం 10 రోజుల్లోపు ఆయన మామూలు మనిషిగా మారారని తెలిపారు. రిమ్స్ లో న్యూరోవ సంబంధించిన అన్ని కేసులు దాదాపుగా చేయడం జరుగుతుందని తెలిపారు. అదిలాబాద్ సూపర్ స్పెషాలిటీలోని న్యూరో తో పాటు అన్ని విభాగాల కు చెందిన వైద్యులు అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. ఇంకా కొంతమంది స్పెషలిస్ట్ వైద్యులు అవసరం ఉందని వారందరూ వచ్చినట్లయితే అదిలాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎలాంటి శాస్త్ర చికిత్స అయినందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యుల కొరత ఉండటం వల్ల కొన్ని శాశ్వత చికిత్సలు చేయలేకపోతున్నామని తెలిపారు. శాస్త్ర చికిత్సలకు సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్నట్టు ఆయన వివరించారు. ఇప్పటికే అన్ని విభాగాల్లో 50 నుంచి 100 మంది వరకు ఓపి చూస్తున్నట్టు తెలిపారు. అందరి సహాయ సహకారాల వల్లనే ఈరోజు ఈ శాస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ నిసికాంత్, డాక్టర్ దేవిదాస్ సామల, అసిస్టింగ్ సర్జన్స్ డాక్టర్ దుర్గ గణేష్, డాక్టర్ వరుణ్, అనస్తీయాలజిస్ట్ డాక్టర్ సతీష్ తదితరవైద్యులు పాల్గొన్నారు.