Sports & Games

Breaking News

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డుల పరిశీలన





నూతనకల్,(ఆరోగ్య జ్యోతి):మండల కేంద్రంలోని స్టాక్ పొజీషన్ రికార్డులను డిఐఓ పెండెం వెంకటరమణ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు వ్యాధి నిరోధక కార్యక్రమానికి సంబందించిన మందులను ఏ విదంగా భద్రపరుస్తున్నారనే విధానం, స్టాక్ పొజీషన్, రికార్డులను పరిశీలించి తగు సలహాలు సూచనలు ఇచ్చారు. వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కీసర అశ్రిత, పిహెచ్ఎన్ తారమ్మ, ఫార్మసిస్టు అనూహ, స్టాఫ్ నర్స్ సునీత, తదితరులు పాల్గొన్నారు.