ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి
ఆదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్యజ్యోతి): ప్రతి ఒక్కరు వారి వారి బర్త్డే సందర్భంగా లేదా ముఖ్యమైన దినాల్లో చెట్లను నాటాలని లేనిపక్షంలో వర్షాకాలంలో ప్రతి ఒక్కరు చెట్లు నాటినట్టయితే అవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జైసింగ్ అన్నారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చెట్లు నాటించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ మాట్లాడుతూ చెట్లు నాటడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. మనిషికి ఆక్సిజన్ అందించడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మన పూర్వీకులు కు గతంలో ఏసీలు కూలర్లు ఫ్యాన్లు లాంటివి ఉండేవి కావని కేవలం చెట్ల ద్వారా వచ్చే గాలితోనే వారు 100 సంవత్సరాలు ఎలాంటి అనారోగ్యం లేకుండా జీవించగలిగారని తెలిపారు. ప్రస్తుత కాలంలో రేడియేషన్ పెరగడం చెట్లను నరకడం చెట్లు పెంచలేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలతో పాటు వాతావరణంలో అనేక రకాల మార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి వారి జన్మదిన సందర్భంగా కాని పిల్లల జన్మదినం సందర్భంగా కానీ పెళ్లిరోజు ఇతర శుభకార్యాల సందర్భంగా చెట్లు నాటినట్లయితే అవి వృక్షాలుగా తయారై మనకు ఎన్నో లాభాలుఇస్తుందనితెలిపారు.సూపరింటెండెంట్ డాక్టర్ ఇద్రిస్ అక్బానీ,డాక్టర్ చద్రశేఖర్, రిమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు