నేషనల్ హెల్త్ మిషన్ కాంటెన్సీ వర్కర్లను రెగ్యులర్ చేయాలి
- ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్
ఆసిఫాబాద్,(ఆరోగ్య జ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో పనిచేస్తున్న కాంటిజెంట్ వర్కలను ఎలాంటి శరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటియుసి కొమరం భీమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున ఎన్హెచ్ఎం స్కీం లో పనిచేస్తున్న కాంటిజెంట్ వర్కర్ల సమావేశం ఆసిఫాబాద్లోని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ కాంటినెంట్ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. వీరిని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమదోపిడి గురించి ఇస్తున్నాయని,కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వలన మీరంతా శ్రమ దోపిడి గురవుతున్నారని అన్నారు,ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని అప్పటివరకు సమాన పనికి సమాన వితరం ఇవ్వాలని చేశారు,ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుకర్ జిల్లా ఉపాధ్యక్షులు ముస్తాక్ కార్మికులు చంద్రకళ గంగుబాయి మాయ లక్ష్మి మల్లేష్ తో పాటుతదితరులు పాల్గొన్నారు.