రిమ్స్ మేటర్నటీ వార్డ్ ముఖద్వారం తెరుచుటకు మోక్షం ఎప్పుడు
- ఏళ్లు గడుస్తున్నా మెటర్నటీవాడు ముఖద్వారం తెచ్చుకోదు
- ముఖ ద్వారానికి వాస్తు దోషమా?..
- ఇబ్బందులు ఎదుర్కొంటున్న గర్భిణీల మహిళల బంధువులు
- ముఖద్వారం ముందు ప్రశాంతమైన ఆవరణ
- పట్టించు కోని అధికారులు
- వార్డ్ ల నుంచే ప్రసూతి వార్డ్ కి వెళ్లడం
- డైరెక్టర్ గారు... జర దేకో ద్వారం తెరిపించండి...
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనుబంధ ఆసుపత్రి లోని మెటర్నటీ వార్డులో ముఖద్వారం తెరవకపోవడం వల్ల రోగులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ముఖద్వారం ఫార్మసీ పక్కనే ఉంది. మంచి రోడ్డు ఆలదకరమైన వాతావరణం రోగుల బంధువులు కూర్చునేందుకు మంచి స్థలం చెట్లు ఉన్నాయి.
మ్స్ ఆసుపత్రి ప్రారంభమైంచి ఇప్పటివరకు ఏళ్లు గడుస్తున్న ముఖద్వారం తెరవకపోవడం వల్ల గర్భిణీలు ప్రసూతి మహిళల బంధువులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ముఖద్వారం తేరవకపోవడానికి వాస్తు దోషం ఏమైనా ఉందా?... ప్రతిరోజు ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుండి రిమ్స్ ఆసుపత్రికి ప్రసూతి కోసం మహిళలు వస్తూనే ఉంటారు.. గర్భిణీలు ప్రసూతి మహిళలు వెళ్లడానికి సరైన ద్వారం లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. అధికారులు ప్రసూతి వాడికి వచ్చినప్పుడు మాత్రం అన్ని వసతులు ఉన్నట్టు హడావిడిగా ఉంటుంది అధికారులు వెళ్లిన తర్వాత అంతంతమాత్రంగానే వసతులు.... ప్రసూతి వాడకు ప్రత్యేకంగా ముఖద్వారం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు ఆ ముఖద్వారాన్ని తెరవడం లేదు ముఖద్వారం తెరిచినట్లయితే ద్వారం ముందు ఆలాధకమైన వాతావరణం పచ్చదనం చెట్లు ఖాళీ స్థలం ఉంది అక్కడ రోగుల బంధువులు కూర్చోవటానికి కూడా మంచి స్థలం ఉంది కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ముఖద్వారం ఏళ్ల తరబడి నుంచి తెరవడం లేదు కేవలం ఆ స్థలం వైద్యులు ఇతరుల ద్విచక్ర వాహనాలు కార్లు పెట్టటానికి మాత్రమే వినియోగిస్తున్నారు ఇవన్నీ తెలిసి కూడా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రసూతి వార్డ్ కు వెళ్లాలంటే అత్యవసర విభాగం నుంచి లేదా పక్క నుంచి వెళ్లాలి. అక్కడ వెళ్లిన తర్వాత కూడా అనేక రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ప్రసూతి వార్డ్ ముఖద్వారం తెరిచినట్లయితే రోగులు ల బంధువులు కూర్చునేందుకు విశాలమైన స్థలం ఉంది. ముఖద్వారం తెరవకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న ద్వారం వల్ల రోగుల బంధువులు కుంపులు గుంపులుగా కూర్చోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా కూర్చునేందుకు సరైన స్థలం లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ గమనిస్తున్న ఉన్నతాధికారులు అంటే డైరెక్టర్ సూపర్డెంట్ ఆర్ ఎం ఓతో పాటు తదితర అధికారులు వార్డు నుంచి ప్రతి రోజు వెళ్తున్నప్పటికీ రోగులు బంధువులు కూర్చునేందుకు స్థలం లేదని గమనిస్తున్న నిమ్మకు నీరెత్తిన విధంగా చూచిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారే తప్ప రోగుల బంధువుల గురించి ఆలోచన విధానమే కరువైంది. ఒకవేళ ఉన్నతాధికారులు స్పందించి ముఖద్వారాన్ని తెరిచినట్లయితే వర్షాకాలం తప్ప మిగతా కాలాల్లో కూర్చున్న అందుకు పచ్చదనంతో కూడిన చెట్లు స్థలం కూడా విశాలంగా ఉంది. అవసరమైతే రిమ్స్ అధికారులు స్పందించి షెడ్ వేసినట్లయితే మంచి వాతావరణం లో రోగుల బంధువులు కూర్చునే అవకాశం ఉంది ఇవన్నీ తెలిసి కూడా రోగుల బంధువులు మరియు గర్భిణీలు బాలింతలను ఇన్ఫెక్షన్ అయ్యే రీతిలో తీసుకువెళ్లడం వల్ల వారికే కాకుండా వారి బంధువులకు ఇతర రోగులకు రోగుల సందర్శకులకు కూడా అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం అంతంత మాత్రంగానే పట్టించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముఖద్వారం తెరిచే అక్కడ ఒక షెడ్డు ఏర్పాటు చేసినట్లయితే రోగుల బంధువులకు విశాలమైన స్థలం ఉండటానికి ఉండటంతో పాటు ఆలాదకరమైన వాతావరణం మధ్యలో కూర్చునే అవకాశం ఉంటుందని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సగ్ రాథోడ్ కు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.?