వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని సందర్శించిన ఆర్.ఎం.ఓ డాక్టర్ చందు
అదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్య జ్యోతి): అదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి లోని పిపి యూనిట్ విభాగం ద్వారా చేపడుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని రిమ్స్ ఆర్ ఎమ్ ఓ డాక్టర్ తొడసం చందు పరిశీలించారు. ప్రతి శనివారం బుధవారం ప్రత్యేక శిబిరంతో పాటు రోజువారీగా ప్రసూతి వార్డులో టీకాలు ఇస్తున్నట్లు సూపర్వైజర్ సుగుణ ఆర్ ఎమ్ ఓ కు సూచించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ డాక్టర్ చందు మాట్లాడుతూ పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని తెలిపారు. అంతేకాకుండా వ్యాధి నిరోధక టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. టీకాలు తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులు రావు ఆరోగ్యం ఎలా ఉంటుందో తదితర వాటిపై తల్లిదండ్రులకు సూచించాలని తెలిపారు. ముందుగా ఏ ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉందో రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త హేమలత తో పాటు ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.