నేషనల్ హెల్త్ మిషను ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి
- ఎన్ హెచ్ ఉద్యోగుల నూతన కమిటీ ఎన్నిక
- నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే అంతవరకు నిరంతరం పోరాటాలు
- నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలి
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ఖన్నా
జనగామ,(ఆరోగ్యజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జనగాం జిల్లా నూతన కమిటీ ఎన్నిక ను జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.జనగాం లోని గబ్బెట గోపాల్ రెడ్డి భవన్, సిపిఐ కార్యాలయం జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఆల్ క్యాడర్స్ సమావేశము జిల్లా అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందనీ జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనీ మాట్లాడుతూ 510 జీవోలో 4000 మంది ఉద్యోగులకు అన్యాయం జరిగిందని అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఉద్యోగులకు చెప్పడం జరిగింది.
..
నూతన కమిటీ జిల్లా అధ్యక్షురాలుగా జ్యోతి, కార్యదర్శిగా గణేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పీ. లిఖితరాణీ, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, కోశాధికారి మల్లేశం, జాయింట్ సెక్రెటరీగా తిరుచు రజిని, ఈసీ మెంబర్ గా సి.హెచ్.అంజయ్య, చీప్ అడ్వైజర్ పీ.సౌజన్య, ఈసీ మెంబర్ డాక్టర్ భార్గవి,ఈసీ మెంబర్ కొండలత, ఈసీ మెంబర్ గా అంజయ్య, లక్ష్మి మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..ఉద్యోగుల సమస్యలపై మీటింగ్ లో పాల్గొన్న జాతీయ ఆరోగ్య మీషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఉద్యోగులు అందరూ కలిసి ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించారు. జనగాం జిల్లా అధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ 510 లో జీవోలో మాకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు వెంటనే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని , ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ మరియు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనాలతో కూడిన సెలవులు మంజూరు చేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని , కనీస వేతనాలు అమలు అయ్యేటట్టు ప్రభుత్వం చేకూర్చాలని ప్రధాన డిమాండ్ లో చెప్పడం జరిగినది..
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు ఏఐటీయూసీ కందిక చెన్నకేశవులు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరిని ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ లో మాట్లాడడం జరిగింది మరియు వారికి కనీస వేతనాలు చట్టాలు మోడీ ప్రభుత్వం 29 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కేంద్ర ప్రభుత్వం అధికారులు అన్యాయం చేశారని 4 కోడ్లను విధానాన్ని రద్దు చేస్తూ గత 29 చట్టాలను కొనసాగించాలని కందిక చెన్నకేశవులు అన్నారు ప్రజలకు నిత్యం వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారి పిల్లలకు ఉచిత విద్య ,ఉచిత వైద్యం అందేలా ప్రభుత్వాలు చూడాలని నూతన ఎన్నికైన ప్రధాన కార్యదర్శి గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాంబయ్య , సి.హెచ్ నిర్మల, సి.హెచ్ , రజిని, లిఖిత, డాక్టర్ భార్గవి, మరి పెళ్లి కవిత, రజిని సౌజన్య ,మల్లేశం , లక్ష్మి తదితరులు పాల్గొన్నారు...