వెయిట్ లాస్ మందులతో కంటిచూపు పోయే
న్యూఢిల్లీ: ఒబెసిటీ, డయాబెటిస్ బాధితు లకు ఇచ్చే పలు ఔషధాల వల్ల అరుదైన కంటి సమస్య వచ్చే ముప్పు ఉందని వెల్ల డైంది. అమెరికాలోని మసాచుసెట్స్ ఐ అండ్ ఇయర్ హాస్పిటల్ పరిశోధకుల బృందం చేసిన ఈ అధ్యయనం వివరాలు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఆప్తమా లజీ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. మధు మేహం ఉన్న వారికి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి షుగర్ లెవల్స్ అదుపులో ఉండటా నికి ఉపయోగపడేందుకు, ఊబకాయంతో బాధపడుతున్న వారికి బరువు తగ్గేందుకు గానూ ఒజెంపిక్, విగోవి వంటి ఔషధా లను వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. సెమా గ్లుటైడ్ అనే ప్రొటీన్ ఉన్న ఈ మందులు వాడే ఊబకాయ బాధితులకు మిగతా వారి కంటే 'నాన్-ఆర్టెరిటిక్ ఆంటీరియర్ ఇషె మిక్ ఆప్టిక్ న్యూరోపతి' సమస్య వచ్చే అవ కాశం ఏడు రెట్లు ఎక్కువ ఉందని పరిశోధ కులు గుర్తించారు. మధుమేహ బాధితులకు ఈ ముప్పు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుం దని పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల హఠా త్తుగా ఒక కన్ను చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు.