Sports & Games

Breaking News

ఎంఎన్ జి ఆస్పత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ

• నోటిఫికేషన్ విడుదల సాక్షి, హైదరాబాద్: మెహిద్ నవాజ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ కేన్సర్ సెంటర్ (ఎంఎన్జ కేన్సర్ సెంటర్)లో 14 విభాగాల్లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి జూలై 12వ తేదీ నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బోర్డు ప్రకటిం చింది. సర్జికల్ ఆంకాలజీలో 9 పోస్టులు న్నాయి. రేడియోథెరపీ (7), అనస్తీషియా(5), గైనిక్ ఆంకాలజీ(4), పీడియాట్రిక్ ఆంకాలజీ (4), పెయిన్ అండ్ పల్లియేటీవ్ కేర్ (4), న్యూక్లియర్ మెడిసిన్ (2), పాథాలజీ(2), ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ (2), రేడియా లజీ (2), బయోకెమిస్ట్రీ, డెంటల్ సర్జరీ, మైక్రో బయాలజీ, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ కేట గిరీలో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత పరీక్ష, పాయింట్లు తది తర వివరాలను బోర్డు వెబ్సైట్లో అందుబా టులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.