Sports & Games

Breaking News

తెలంగాణ రాష్ట్రంలో ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న రెండవ ANM లను బేషరతుగా రెగ్యులర్ చేయాలి

 - AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్

ఆసిఫాబాద్,(ఆరోగ్యజ్యోతి):
తెలంగాణ రాష్ట్రంలోని NHM స్కీంలో పనిచేస్తున్న  2వ ANMలను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్  డిమాండ్ చేసారు,పని ఒత్తిడి తగ్గించాలని ఈనెల 18వ తేదీన కమిషనర్ కార్యాలయం ఎదుటజరిగే  ధర్నా కార్యక్రమాన్ని జిల్లాలోని2వ ANMలు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు,సోమవారం రోజున కొమురం భీం-ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన PHC మెడికల్ ఆఫీసర్ సుజిత్ కి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ ANMగా విధులు నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం ఆగస్టు నెలలో మమ్మల్ని బే షరతుగా రెగ్యులర్ చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో సమ్మె చేసిన విషయం తమకు విధేయతమే. సమ్మె సందర్భంగా జరిగిన చర్చల్లో మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి, లేదా గ్రాస్ శాలరీ ఇవ్వడానికి, మా పని ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం 02-09-2023 న ఒక కమిటీని వేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఆ కమిటీ ఇంతవరకు సమావేశము అవ్వకపోగా సమ్మె విరమించిన నాలుగు రోజుల నుండి మాకు కొత్త APPలను తీసుకురావడం జరిగింది. నాలుగు కొత్త APPలు రావడం కారణంగా గతంలో ఉన్న పని ఒత్తిడి కంటే ఇప్పుడు ఇంకా పెరిగింది. అందుకనే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి తెలంగాణ రాష్ట్రంలో PHC, UPHCలలో పనిచేస్తున్న రెండవ ANMలను రెగ్యులర్ చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన కమీషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని తమకు తెలియజేస్తున్నాం. కనుక గమనించగలరు.ఈ కార్యక్రమంలో 2వ ANM ల సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి ప్రమీల,2వ anm లు సునీత,వనిత, విజయ లక్ష్మి, పద్మ, తులసి పాల్గొన్నారు
డిమాండ్స్:

1) తెలంగాణా రాష్ట్రం లో పనిచేస్తున్న 2nd ఏఎన్ఎంలను భేషరతుగా రెగ్యులర్ చేయాలి..

2) ఒకవేళ పరీక్ష పెట్టాల్సివస్తే పోస్టులను పెంచి గతంలో ఇచ్చిన హామీల ప్రకారమే ఏజ్ రిలాక్స్, 30% వైటేజీని ఇచ్చి పెట్టాలి.

3) పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

4) పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా ఈ రెండవ ఎఎన్ఎంలకు కూడా ప్రతి నెల 1 వ తేదీనా జీతాలు చెల్లించాలి.

5) NCD screenig నుండి రెండో ఏఎన్ఎం లను మినహాయించాలి.

6) 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఎవరైనా ఏఎన్ఎంలు దురదృష్టవశాస్తూ మరణిస్తే 10 లక్షల ఎక్స్ గ్రేషియాను అందించాలి.

7) పరీక్ష రాయటానికి అవకాశం లేనటువంటి 53 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి రిటైర్మెంట్ అయ్యే సమయంలో ఐదు లక్షల రూపాయల లైఫ్ టైం గ్రాట్యుటీని అందించాలి.

8) రెగ్యులర్ అయ్యేంతవరకు పిహెచ్సీలో ఫస్ట్ ఏఎన్ఎం లేని సబ్ సెంటర్లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంకు 10000 రూపాయలు అదనపు వేతనాన్ని అందించాలి.

9) యుపిహెచ్సిలో ఒకే ఏఎన్ఎం పనిచేస్తున్న చోట 15వేల రూపాయల అదనపు వేతనాన్ని అందించాలి.

10) యుపి హెచ్సీలో కూడా ఒక సబ్ సెంటర్కు జనాభాను 5 వేలకు తగ్గించాలి..

11) ప్రతి సంవత్సరానికి రూ.4,500 యూనిఫామ్ అలవెన్స్ అందించాలి.

12) పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా ఈ రెండవ ఎఎన్ఎంలకు కూడా సెలవులు మంజూరు చేయాలి.

13) ఎవరైనా కాంట్రాక్ట్ ఏఎన్ఎం దురదృష్టవశాస్తూ మరణిస్తే వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరు నెలల లోపు కారుణ్య నియామకం కింద కాంట్రాక్ట్ బేసిస్ లో అయినా ఉద్యోగాన్ని అందించాలి.

14) నల్లగొండ జిల్లాలో ప్రవేశపెట్టిన జియో ట్యాగ్ నుండి ఫీల్డ్ స్టాప్ అయినా ఏఎన్ఎం లను మినయాయించాలి.

15) కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కి కూడా బదిలీలకు అవకాశం కల్పించాలి.