Sports & Games

Breaking News

జనగామ జిల్లా ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొండ్రలత

జనగామ (ఆరోగ్యజ్యోతి): జనగామ జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జనగామ జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా లతను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ మెంబర్ లత ఆరోగ్య జ్యోతి తో మాట్లాడుతూ తనపై పూర్తయిన నమ్మకంతో జనగామ జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తనపై పూర్తి నమ్మకంతో ఎన్నుకున్నందుకుగా తమ దృష్టికి వచ్చిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.