పిండ లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన కల్పించాలి
గర్భస్థ పిండలింగనిర్దారణ నిషేధిత చట్టం-1994అమలు చేయడం
చట్టం పై ప్రజల్లో అవగాహనకు చర్యలు :జే సి ఎస్.
నుపూర్అజయ్,అమలాపురం,(ఆరోగ్యజ్యోతి):ఆడ శిశువు పట్ల వివక్షతతో కొనసాగు తున్న భ్రూణ హత్యలు నివారణ కొరకు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధితనిర్దారణ చట్టo-1994(పి సి, పి ఎన్ డి టి)ను పటిష్టంగా అమలు చేయ డంతో పాటుగా చట్టంపై పూర్తి అవ గాహన ప్రజలలో కల్పించేవిధంగా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కమిటీ సభ్యులకు సూచించారు.. శనివారం స్థానికకలెక్టరేట్ నందు జిల్లా జాయిం ట్ కలెక్టర్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ, ఆధ్వర్యం లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం- 1994, రూల్స్ 1996 అర్ట్ సురోగసి అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబ ర్ అప్రాప్రియేట్ అథారిటీ, సలహా కమిటీ సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లాస్థాయి, పీసీ, పీఎన్‌డీ టీ సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీ క్షలను లింగ నిర్ధారణకు దుర్విని యోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ల పై నిఘా ఉంచా లన్నారు. ఆల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్ట రీత్యా నేరమని, ఆడపిల్ల అని తెలియగానే వివక్షతతో భ్రూణ హత్యలకు పాల్ప డటo చట్టరీత్యా నేరమన్నారు జిల్లాస్థాయిలో ప్రభుత్వ నిబం ధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే పెనాల్టీలు శిక్షలు విదించాలని స్పష్టం చేశారు. జిల్లాలో గుర్తింపు పొందిన స్కానింగ్ సెంట ర్లపై లింగ నిర్ధారణ ఫలితాలు వెల్లడి పై డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించి లింగ వివక్ష తకు తావు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి లింగ వివక్షతను పూర్తిగా అరికట్టాలన్నారు. స్కానింగ్ సెంటర్లుకు సంబంధించి అనుమ తులు పునరుద్ధరణ, కొత్త స్కానింగ్ సెంటర్లు కొరకు దరఖాస్తులను కమిటీ ఆమోదానికి పంపిన తగు విచారణ చేపట్టాలన్నారు. పిండ లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి గ్రామ స్థాయిలో వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వ హణకు చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల లోనూ పీసీ, పీఎన్డీటీ చట్టానికి సంబంధించిన బోర్డులను, గోడ పత్రికలను ప్రదర్శించాలని అధికా రులకు సూచించారు. జిల్లాలో చట్టం అమలు తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్, రెన్యువల్, డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ కు వివరించారు. జిల్లాలో ప్రోగ్రామ్ అధికారులు, క్షేత్రస్థాయి అధికా రులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం పరిధిలోని లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. అబార్సన్స్ జరుగుతున్న , లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని స్పష్టం చేశారు.పీసీ, పీఎన్‌డీటీ చట్టంపై అవగాహన పెంపొందించే పోస్టర్లను కొత్తగా ఏర్పాటవుతున్న స్కానింగ్ కేంద్రాల్లోనూ తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం దుర్గా రావు దొర ప్రసంగిస్తూ భ్రూణ హత్య లు అరికట్టడానికి అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల న్నారు తల్లి గర్భంలో పిండస్త శిశు మరణాలు నిరోధించాలని చెప్పారు లింగ నిర్ధారణ చేస్తే సంబంధిత సెంటర్లపై కఠిన చర్యలు తీసు కోవాలని ఆదేశించారు స్కానింగ్ చేసిన తర్వాత లింగ నిర్ధారణ చట్ట రిత్యా నేరమన్నారు క్షేత్రస్థాయిలో విచారిస్తున్న ఫోటోలు సంబంధిత ధ్రువ పత్రాలు పరిశీలన నివేదిక సమర్పించిన తదుపరి అనుమ తులు ఇవ్వాలన్నారు. జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డెకాయ్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించి చట్టం యొక్క ఆశయా న్ని కాపాడాలన్నారు డెకాయ్ ఆపరేషన్లను విసృతం చేయాలని సూచించారు. తనిఖీలను ముమ్మ రం చేయాలని. ఎక్కడా చట్ట ఉల్లం ఘనలు జరగకుండా చూడాల న్నారు. జిల్లావ్యాప్తంగా 83 అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలు ఉన్నా యని వీటిలో 70 ప్రవేట్ ఆర్గనైజేషన్ ద్వారా నడుస్తున్నా యని 13 ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా నిర్వహించడం జరుగు తుంద న్నారు. చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ కొత్తగా స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి రెండు దరఖాస్తులు, నాలుగు స్కానింగ్ కేంద్రాల పునరుద్ధరణకు దరఖా స్తులు వచ్చాయన్నారు. రావుల పాలెంలో ఒక స్కానింగ్ సెంటర్ రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిఐఓ బివివి సత్య నారాయణ, ఎడిషనల్ డిఎం హెచ్ ఓ, సిహెచ్ వి భరత లక్ష్మి, డాక్టర్ సుమలత, స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్రావు, డాక్టర్ పి ఎస్ శర్మ, జన కళ్యాణి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి జి శ్రీనివాసరావు, కె వి ఎస్ ఎన్ మూర్తి తదితరులు ఫా ల్గొన్నారు.