అడిషనల్ ట్రైబల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సేవలు మరువలేనివి
- తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవి విరమణ ఆత్మీయ వీడుకోలు సభ
- ప్రభుత్వ ఉద్యోగంలో పదవి విరమణ సాధారణమే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ అడిషనల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేసిన డాక్టర్ కుమ్రబాలు పదవి విరమణ ఆత్మీయ వీడ్కోలు సభను తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రోజు నిర్వహించారు. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవి విరమణ ఆత్మీయ వీడ్కోలు సభకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, అడిషనల్ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సాధన, పదవి విరమణ పొందుతున్న అడిషనల్ డీఎం అండ్ డాక్టర్ కుమురబాలు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్, పి ఎన్ డి టి డాక్టర్ మనోహర్, రిటైర్డ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తొడ సం చందు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్ ఆధ్వర్యంలో పదవి విరమణ ఆత్మీయ వీడుకోలు సభను నిర్వహించారు. పదవి విరమణ పొందుతున్న డాక్టర్ కుమ్ర బాలులకు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పటి నుండి పదవి విరమణ పొందేంతవరకు డాక్టర్ కుమ్ర బాలు పేద బడుగు బలహీన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎనలేని వైద్య సేవలు అందించాలన్నారు. ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఒక గుర్తింపు వైద్యునిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. పదవి విరమణ అనేది ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కి ఉంటుందని తెలిపారు. కుమ్ర బాలు అందరితో కలిసి మెలిసి పనిచేసేవాడని తెలిపారు. ఆయన సేవలను మనం మర్చిపోలేనివని తెలిపారు.ఆదిలాబాద్ జిల్లాలో అడిషనల్ ట్రైబల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా ఆయన గిరిజన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎనలేని సేవలు అందించినట్టు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పదవి విరమణ చేయడం ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పదవి విరమణ అనేది తప్పనిసరి అని తెలిపారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న డాక్టర్ కుమ్ర బాలు మాట్లాడుతూ తన పదవీ విరమణ చేయడం ఎంతో బాధాకరంగా ఉందని తెలిపారు. కానీ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రతి ఒక ప్రభుత్వ ఉద్యోగి పరం పదవి విరమణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి వార్ మాట్లాడుతూ పదవి విరమణ పొందుతున్న అడిషనల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కుమ్ర బాలు వైద్య ఆరోగ్యశాఖ తోపాటు జిల్లా ప్రజలకు వైద్య పరంగా ఎనలేని సేవలందించారని తెలిపారు. ఆయన సేవలో ఇప్పటివరకు గుర్తింపు ఉందని తెలిపారు. పదవి విరమణ పొందుతున్నప్పుడు ఎంతో బాధాకరంగా ఉందని కానీ ప్రభుత్వ నిబంధన ప్రకారం మనం ప్రతి ఒక్క ఉద్యోగి పదవి విరమణ చేయాల్సిందేనని తెలిపారు. గిరిజన లకు ఆయన ఎనలేని సేవలందించారని ఇప్పటికి గిరిజనుల గుండెల్లో నిలిచి ఉన్నాడని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందుతున్న అడిషనల్ ట్రైబల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి బాలుకు సన్మానం చేయడం మా సంఘ నికి మరియు సంఘ సభ్యులకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోత్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రసాద్, డాక్టర్ ఆనంద్, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ డాక్టర్ శ్రీకాంత్ మెట్పల్లి వార్ , వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరీష్ కుమార్, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ వంశీకృష్ణ, కన్వీనర్ డాక్టర్ బుడుగు స్వామి సెక్రటరీ డాక్టర్ రాంబాబు డాక్టర్ సర్పరాజ్ , డాక్టర్ శ్రావ్య వాణి, డాక్టర్ నయనతా, డాక్టర్ సుచల, డాక్టర్ అనురాధ ,డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ ప్రవీణ్ తోపాటు వైద్యులు మెడికల్ పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.