Sports & Games

Breaking News

ఆరోగ్య శిబిరాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలి

హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): ప్రజలకు ఆరోగ్యాన్నించే ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని గ్లోబల్ ఉమెన్ రైట్స్ సొసైటీ అధ్యక్షులు గలయాన్ మిరియం బాపు అన్నారు. ఆదివారం నాడు గ్లోబల్ ఉమెన్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్లో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి విద్య మరియు ఆరోగ్య శిబిరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం పై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరికి వివరించాలని తెలిపారు 2024 -25 సంవత్సరం గాను పేదలకు సహాయం అందించడంలో ముందుండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సేవా భవంతో ప్రతి ఒక్కరు పని చేయాలని పేద ప్రజలకు ఆదుకోవడంలో ముందుండాలని తెలిపారు. గ్రామ గ్రామాల్లో తిరిగి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆరోగ్యం పై అవగాహన కల్పిస్తూ ఉండాలని తెలిపారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని మొక్కల వల్ల మంచి గాలి ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు అంతేకాకుండా దేవాలయాల్లో పార్కులోను మొక్కలు నాటాలని సూచించారు గ్రామ పరిరక్షణ కమిటీ మరియు మండల కమిటీ నియోజకవర్గ కమిటీలను నిర్వహించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఎంపీ పరిధిలోని కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని శ్వేత శ్రీ అన్నారు .అంతేకాకుండా మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తూ మహిళలకు వృత్తివిద్య సమాజంపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని తెలిపారు ఆమె గ్లోబల్ ఉమెన్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సమావేశం నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అంతేకాకుండా పచ్చదనం పరిశుభ్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు మహిళా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు మహిళలకు వచ్చే జబ్బుల గురించి కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చైతన్య పరచాలని తెలిపారు జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చాక తీసుకోవాల్సిన చికిత్సలు తదితర వాటిపై ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో పుష్ప చౌదరి, పార్వతి, పద్మావతి, శ్రీనివాస్ గౌడ్, గోపి, పరమేశ్వరి గౌడ్, అమృత, శకుంతల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తల కొరకు సంప్రదించండి..9848289499,9848025451