46 మంది గర్భిణీలకు స్కానింగ్ పరీక్షలు
46 మంది గర్భిణీలకు స్కానింగ్ పరీక్షలు
భీంపూర్ (ఆరోగ్య జ్యోతి): భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ధనోర, అంతర్బంద్,అర్లి,గిర్గాం,నిపాని పరిధిలోని గ్రామాల 46 గర్భిణీ స్త్రీలను స్కానింగ్ పరీక్ష లను ప్రత్యేక గర్భకోశ వైద్య నిపుణులు డా"కౌస్తుభ విజయసారథి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది .వైద్యాధికారి సూచనల ప్రకారంగా గర్భిణీ స్త్రీలు అవసరమైన రక్తపరీక్షలను నిర్వర్తించుకోవాలని ,క్రమం తప్పకుండా మామూలు నిర్థారిత వ్యాయామాలు చేయాలని, నిత్యం పోషకాహారం భుజించాలని, అనుబంధం పోషకాహారం సంబంధిత అంగన్వాడి సెంటర్ల నుండి తీసుకోని గర్భిణీ స్త్రీలు ఉపయోగించుకోవాలని, సురక్షిత కాన్పుల కోసం మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని,4-ప్రమాదభరిత లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను గుర్తించడం జరిగిందని మండల వైద్యాధికారి డా" నిఖిల్ రాజ్, మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ లు తెలిపారు ఈకార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్,పర్యవేక్షకులు బి.గంగాధర్, స్టాఫ్ నర్స్ ప్రవీణ,,యం.యల్.హెచ్.పి, సాహితి, మాయావతి, ఆరోగ్య కార్యకర్తలు లచ్చుబాయ్,నఫీజ, ప్రయోగ శాల నిపుణులు సంతోష్, ఫార్మాసిస్ట్ అశోక్ రెడ్డి, సిబ్బంది రేఖ, శంకర్, ఆయా ఉపకేంద్రాల ఆశాకార్యకర్తలు గుణాదేవి,అనసూయ,గంగుబాయ్,కమల, సంతోషిని, స్వప్న,పద్మ పాల్గొన్నారు