Sports & Games

Breaking News

ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కి వినతి పత్రం

ల్యాబ్ టెక్నీషియన్ సమస్యలను పరిష్కరించారని ముఖ్యమంత్రి కి వినతి పత్రం
హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ను రెగ్యులర్ చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కవ్వాన్ లక్ష్మారెడ్డి వినతి పత్రాన్ని సమర్పించారు. నేషనల్ హెల్త్ మిషన్లో గత 20 సంవత్సరాల నుండి ల్యాబ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారని అప్పటినుంచి ఇప్పటివరకు ప్రభుత్వం రెగ్యులర్ చేయలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నెలనెల వేతనాలు రాక ఇతర అలవెన్స్ లేకపోవడంతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ప్రతి నెల ఒకటో తారీకు వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నీ కోరినారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలు అన్ని తమ దృష్టిలో ఉన్నాయని విడతల వారీగా సంవత్సరం పరిష్కరిస్తావని ముఖ్యమంత్రి తెలిపారు.