Sports & Games

Breaking News

ఆర్ఎంపి పిఎంపి వైద్యుల క్లినిక్లపై పొట్ట ప్రభుత్వం దాడులు ఆపాలి

ఆర్.ఎం.పి పిఎంపి లా ప్రాథమిక చికిత్స కేంద్రాలపై ప్రభుత్వం దాడులు ఆపాలి
- గ్రామాల్లో మొదట రోగుల ప్రాణాలు కాపాడుతున్నది ఆర్ఎంపీలే
- ఆర్ఎంపీలకు విధి విధానాలు ఉంటే ప్రభుత్వ వైద్యులకు కూడా విధివిధానాలు ఉన్నాయి
- ఆర్ఎంపీలకు విధి విధానాలు వర్తింప చేస్తే ప్రభుత్వ వైద్యులకు కూడా ప్రభుత్వం వెంటనే విధివిధానాలు అమలు చేయాలి
- తెలంగాణ ఆర్.ఎం.పి. పిఎంపి సంఘాల అధ్యక్షులు వెంకటరెడ్డి
శేరిలింగంపల్లి హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాల నుండి వైద్యం అందిస్తున్న ఆర్ఎంపి పిఎంపి వైద్యులపై వైద్యశాఖ అధికారులు దాడులను వెంటనే నిలిపివేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి పి.ఎం.పి సిపిఈపి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే కల్పించుకొని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డ్రగ్ కంట్రోల్ విభాగాల కు వెంటనే ఆదేశాలు జారీచేసి దాడులను నిలిపివేయాలని ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు ప్రభుత్వం ఆర్ఎంపీ పి.ఎం.పి ల మీద దాడులు నిర్వహిస్తే రోగులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఒకవేళ ప్రభుత్వం ఆర్ఎంపీపీ ఎంపీ వైద్యం మీద దాడులు నిర్వహించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులపై కూడా దాడులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్లు 428, 429, 1273 ప్రకారం ప్రథమ చికిత్స కేంద్రాలలో తమ పరిధిలోనే వైద్య సేవ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గ్రామీణ వైద్యుల పై ప్రతాపం చూపడం భాగ్యం కాదని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యుల ను వదిలి ఆర్ఎంపీ ల మీద దాడులు చేయడం న్యాయంగా లేదని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు గ్రామాల్లో గ్రామీణ వైద్యులు ఉండటం వల్లనే చాలామంది రోగాల బారిన పడిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ చికిత్స తీసుకుంటూ ఉన్న తర్వాత తగ్గనీడల పట్టణ ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందుకుంటున్నారని తెలిపారు మొదటగా అత్యవసర వైద్యం అందించే ప్రాణాలు కాపాడేది గ్రామీణ వైద్యులేనని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కొంతమంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులతో పై కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వం తీసుకువస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు తక్కువ ధరకు అందిస్తూ ప్రజలకు ప్రాణాలను కాపాడుతున్న వారికి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సహజం కాదని తెలిపారు. గ్రామాల్లో అర్ధరాత్రి వేళ అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బందులు ఎదురైన వారు వెంటనే ఆర్.ఎం.పి.ఎం.పి గ్రామీణ వైద్యుల వద్దకు వస్తే వెంటనే ఆయన వెళ్లి వైద్య సేవ అందిస్తారని అదే పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే వైద్యులు లేరని తీపి పంపుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం ఆర్.ఎం.పి వైద్యులపై దాడులు ఆపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. వార్తల కొరకు సంప్రదించండి..9848289499,9848025451.