బస్తీ దౌఖానాల సిబ్బందికి రెండు నెలల వేతనం
వరంగల్ (ఆరోగ్య జ్యోతి): బస్తీ దౌఖాంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం రెండు నెలల కు సంబంధించిన వేతనాన్ని వారి వారి ఖాతాలో జమ చేశారని నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 శనివారం రోజు బస్తీ దౌఖానాల సిబ్బంది ఖాతాల్లో ప్రభుత్వం రెండు నెలలకు సంబంధించిన వేతనాన్ని వేయడం జరిగిందని వారి ఖాతాలను చెక్ చేసుకోవాలని ఆయన తెలిపారు. బస్తీ దౌఖాణంలో పనిచేస్తున్న వైద్యాధికారులు స్టాఫ్ నర్స్ మరియు సపోర్టింగ్ స్టాప్ అందరికీ ప్రభుత్వం వేతనం వేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ దృష్టికి వేతనాలు రావడం లేదని బస్తీ దౌఖానాల సిబ్బందికి వెంటనే వేతనాలు ఇవ్వాలని గతంలో వివరణ ఇవ్వడం వల్లనే వేతనాలు ప్రభుత్వం వేసింది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు బస్తీ దౌఖానాల సిబ్బందికి ప్రభుత్వం రెండు నెలల వేతనం వేసినందుకు ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గత కొన్ని నెలల నుండి వేతనం రావడం లేదని ఆ వేతనాన్ని కూడా వెంటనే వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు వేతనాలు రాక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వేతనాల చెల్లించాలని ఆయన కోరారు.