సికిల్ సెల్ పై టెలి కాన్ఫరెన్స్
అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): సికిల్ సెల్ పై ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ జిల్లా ఇమ్మనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ మిట్టపల్లి వార్ ఆధ్వర్యంలో వైద్యులకు ఎం ఎల్ హెచ్ పి లకు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎర్ర రక్త కణాల యొక్క ఈమోలైసిస్ కారణంగా లక్షణాలు కనిపిస్తాయి అన్నారు. ముఖ్యంగా రక్తహీనత అలసట లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ వ్యాధి పుట్టిన పిల్లలకు రావచ్చు ఏ వయసు వారికైనా రావచ్చు అని వారు తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ దగ్గర్లోని ఆసుపత్రిలో సికిల్ సెల్ కు సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించాలని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయినట్లయితే చికిత్స ప్రారంభించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు సికిల్ సెల్ పై ఎం ఎల్ హెచ్ పి లకు వైద్యులకు మెడికల్ మెడికల్ సిబ్బందికి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.