క్లబ్ ఫుట్ శిబిరానికి విశేష స్పందన
- జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్
ఆదిలాబాద్( ఆరోగ్యజ్యోతి): ఆర్.బి.ఎస్.కె DEIC ఆధ్వర్యంలో నిర్వహించిన క్లబ్ పుట్ శిబిరానికి విశేష స్పందన లభించినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ తెలిపారు. ఈ శిబిరంలో ఉమ్మడి జిల్లాలోని 49 మంది పిల్లలకు వక్రపాద పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జిల్లా నలుమూలల నుండి ఈ శిబిరానికి అధిక సంఖ్యలో వచ్చారు ఆసుపత్రిలోని రెండవ అంతస్తులు రూమ్ నెంబర్ 46 లో ఈ శిబిరాన్ని నిర్వహించారు ఆర్బిఎస్కే మరియు డైక్ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు అప్పుడే పుట్టిన పిల్లలనుండి 18 సంవత్సరాల పిల్లల వరకు ఉమ్మడి జిల్లాలోని 49 మంది పేషెంట్లు రావడం జరిగింది ఇందులో 46 క్లబ్ ఫుట్, ఆరు ప్లాట్ పుట్ వరకు గుర్తించి వీరికి సర్జరీ అవసరం అని రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్థోపెటిక్ డాక్టర్ నాగరాజు తెలిపారు ఇందులో ఆరు ఊరు మంది పిల్లలకు బర్డ్ హాస్పిటల్ తిరుపతికి 43 మంది పిల్లలకు డ్రీమ్స్ రిఫర్ చేశారు అలాగే గతంలో అనగా 2019లో 10 మంది పిల్లలకు 2021లో 9 మంది పిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేయించారు. ఈ కార్యక్రమంలో పీజీ రాజు యాదవ్, క్యూర్ ఎన్జీవో విజయ, డాక్టర్ రాధి,క నాగార్జున రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దొంతుల ప్రవీణ్, ఎస్కే సన, ప్రశాం,త్ ఉమాకాంత్, వినోద్, నారాయణ, సాగర్, వీణ సాగర్ తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంహెచ్టి వైద్యులు తో పాటు తదితరులు పాల్గొన్నారు