Sports & Games

Breaking News

ఆరోగ్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా హోలీ

ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది హెచ్ వన్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం రోజు ఘనంగా హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా హెచ్ వన్ వైద్య ఆరోగ్య సంఘం అధ్యక్షులు బండారి కృష్ణ ఆధ్వర్యంలో హోలీ పండుగను నిర్వహించారు. హోలీ వేడుకల్లో ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తోపాటు రీమ్స్ సిబ్బంది వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని హోలీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్, హెచ్ వన్ జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణులు మాట్లాడుతూ పోలి అనేది పూర్వం నుంచి వస్తున్న పండగ అని తెలిపారు హోలీ పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు హోలీ పండగను జరుపుకుంటారని తెలిపారు గతంలో మోతుగా పువ్వుతో తయారుచేసిన రంగులను వాడేవారని కాలా రంగులను వాడేవారని, కాలం మారుతున్న తరంలో రంగులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు ఓన్లీ పండుగ ఒక సంబరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.