Sports & Games

Breaking News

ప్రభుత్వం ఎమ్ ఎల్ హెచ్ పీ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Editor k Naresh Kumar 98480 25451
 .

*ఖమ్మం జిల్లా సదస్సులో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్

ఖమ్మం, (ఆరోగ్య జ్యోతి):నేషనల్ హెల్త్ మిషన్ నందు పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్ హెచ్ పి ) ల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గాదే లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన మీట్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ నిబంధనల మేరకు మన రాష్ట్రంలో దాదాపు 2000 మంది మిడ్ లెవెల్ హెల్త్ వర్కర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది అన్నారు. వాస్తవానికి డబ్ల్యూహెచ్వో నిబంధన ప్రకారం కేవలం బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన వారిని మాత్రమే నియమించాలని, కానీ మన రాష్ట్రంలో ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వైద్యులతో పాటు, ఆయుర్వేదిక్, హోమియో, యునాని డిగ్రీ చేసిన వారిని కూడా నియమించారన్నారు. వారిని నియమించటానికి ఏఐటీయూసీ వ్యతిరేకం కాదని కాకపోతే వారికి  52 వేల నుండి 40000 వరకు జీతాలు చెల్లిస్తే  బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ చేసిన వారికి  కేవలం 29 వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. నోటిఫికేషన్ వివరాల ప్రకారం పర్ఫామెన్స్ బేసిడ్ ఇన్సెంటివ్  ( పిబిఐ) 15వేల రూపాయలు చెల్లించాల్సి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చెల్లించడం లేదన్నారు.*సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందేనన్నారు* 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా వీళ్లకు వర్తింపజేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వీరి సమస్యలపై త్వరలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ను కలిసి విన్నవించునున్నట్లు ఆయన  ఈ సందర్భంగా తెలియజేశారు . అనంతరం ఖమ్మం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. *నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కొత్తపల్లి అలేఖ్య, బండారు ప్రవీణ్ ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా బొజ్జ ప్రతిభా భారతి, ఆరం సంధ్య,సహాయ కార్యదర్శులుగా డప్పు కళ్యాణి, ఆకారపు రాజేష్ , కోశాధికారిగా ఆలకుంట  దేవేందర్ లతోపాటు మరో 11 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగూ నరసింహారావు తెలంగాణ రాష్ట్ర ఎం.ఎల్.హెచ్ .పి యూనియన్ గౌరవాధ్యక్షులు తోట రామాంజనేయులు, ఏఐటియుసి ఖమ్మం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు రావి శివరామకృష్ణ, ఉపాధ్యక్షురాలు సిహెచ్ సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.