ఏపీలో జూనియర్ డాక్టర్స్ కు గుడ్ న్యూస్
జూడాలకు 15 శాతం గౌరవ వేతనాలు పెంపు
ఏపీలో జూనియర్ వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి గౌరవ వేతనాలను 15 శాతంపెంచుతూ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. పెంచిన జీతాలు ఈ ఏడాది జనవరి నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు.రెసిడెంట్ స్పెషలిస్టులకు 70వేల నుంచి 80,500, రెసిడెంట్ డెంటిస్ట్లకు ₹65వేల నుంచి ₹74,750, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు 85వేల నుంచి ₹97,750ల వరకు జీతాలు పెరిగాయి.
