ఆరోగ్య పాఠశాల తో విద్యార్థులు అనేక రకాల మార్పులు - జిల్లా కలెక్టర్ రాజార్షి షా
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్:ఆరోగ్య పాఠశాల ప్రారంభించిన 22 రోజుల్లో నే విద్యార్థుల్లో ఘననీయమైన మార్పు.విద్యార్ధుల మంచి భవిష్యత్తు కు రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పం తో జిల్లా పాలనాధికారి రాజర్షి షా రూపొందించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమం సందర్భంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, స్టూడెంట్ చాంపియన్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా మండలాల నుండి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల స్టూడెంట్ చాంపియన్ లు వారి వ్యక్తిగతంగా మార్పులు, తోటివారి లో, కుటుంబం లో మార్పులు తీసుకురావడం జరిగిందని వారి మాటల్లో జిల్లా పాలనాధికారి వివరించారు. ఆరు సూత్రాలను పాటిస్తూ పాఠశాలల్లో ఉదయం ప్రార్థన సమయం లో , సాయంత్రం సమయంలో ఉపాద్యాయులు చెప్పే వాటి పై అవగాహన చేసుకొని ఇంట్లో తల్లిదండ్రుల తో చర్చించడం జరుగుతుందని, అలాగే కుటుంబం లో మద్యం, పొగాకు సేవిస్తే వచ్చే అనారోగ్యాల పై క్లుప్తంగా వివరించి వాటికి దూరంగా ఉండాలని అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
విద్యార్థుల్లో పొగాకు, గుట్కా తినేవారు సైతం ఇక నుండి వాటి జోలికి వెళ్లమని ప్రతిజ్ఞ చేశారని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలియని విషయాలు తెలుసుకొని వాటిని పాటిస్తూ ఆరోగ్యంగా, ఒత్తిడికి లోను కాకుండా, విద్యార్ధులు సొంతంగా పరిశుభ్రత అలవాట్లను పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకొని తిన్న తరువాత ప్లేట్స్ శుభ్రం చేసుకొని పద్ధతి పాటించడం జరుగుతున్నదని ఆన్నారు.
ఆరోగ్య పాఠశాల కు ముందు ఆరోగ్య పాఠశాల ప్రారంభించిన తర్వాత విద్యార్థుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలని తెలిపారు.అలాగే కొంత మంది పిల్లలు భోజనం చేసేటప్పుడు కూరగాయలు, టమాటా, కరివేపాకు, తదితర తినకుండా పడేసేవారమని వాటి పోషక విలువలు తెలిసిన తర్వాత తింటున్నమని, అలాగే కోడి గ్రుడ్లు తినని వారు కూడా తింటున్నారని, అరటి పండ్లు, పల్లి భట్టి, తదితర వాటిని ఇష్టంగా తింటున్నామని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటున్నామని, విద్యార్ధులు వారి మాటల్లో వివరించారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి విద్యార్ధులు, ఉపాద్యాయుల అభిప్రాయాలు విని, ఈ ఆరోగ్య పాఠశాల కార్యక్రమం జిల్లాలో 14 నవంబర్ 2024 ప్రశ్రభించి ఈ రోజు కు 22 రోజులు గడిచాయని, విద్యార్ధులకు కలిగిన లాభాలు , పిల్లలలో కలిగిన మార్పులు వ్యక్తిగత పరిశుభ్రత పిల్లలు సొంతంగా పరిశుభ్ర త అలవాట్లను అలవర్చుకోవడం మంచి శుభ పరిమణామన్నారు .ఈ సందర్భంగా స్టూడెంట్ చాంపియన్ లకు సర్టిఫికెట్స్ అంగజేశారు.ఈ కార్యక్రమం ప్రతి విద్యార్థికి చేరువయ్యేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, ఆరోగ్య పాఠశాల ద్వారా ప్రతి విద్యార్థుల్లో అవగాహన కలగాలని ఆన్నారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, meo lu, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.