Sports & Games

Breaking News

పరీక్ష వాయిదా వేయకుంటే నిరవధిక సమ్మె?..

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 


- కాంట్రాక్ట్ ఏ.ఎన్.ఎం లందరిని యధావిధిగా రెగ్యులర్ చేయాలని ఎంజీఎం కూడలిలో రాస్తారోకో చేసిన ఏఎన్ఎంలు .
- రాత పరీక్ష వాయిదా వేయకుంటే నిరవధిక సమ్మె చేస్తాం,-యాద నాయక్.
వరంగల్, (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు,ఈ.సీ.ఎ ఎన్. ఎంలు,ఆర్బన్ హెల్త్ సెంటర్స్ ఏ.ఎన్.ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు, హెచ్.ఆర్డి ఏఎన్ఎంలు ఇతర అన్ని రకాల ఏ.ఎన్.ఎంలను రాత పరీక్ష లేకుండ యధావిధిగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ లోని  ఎంజీఎం కూడలిలో రాస్తారోకో చేయడం జరిగింది,ఈ రాస్తారోకో వలన భారీగా వాహనాలు స్తంభించాయి,ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నేత,తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ మాట్లాడుతూ... వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో  పనిచేస్తున్న ఏ.ఎన్.ఎంలు 25 సంవత్సరాల నుండి రెగ్యులర్ కాకుండ,కనీస వేతనాలు అందక,ఇతర చట్టబద్ధ సౌకర్యాలు పొందకుండ దుర్భర జీవితాలను గడుపుతున్నారని, ప్రభుత్వాలు మారిన వీరి బ్రతుకులు మారకపోవడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు,గత 25 సంవత్సరాలుగా సమస్యల పరిష్కారానికి వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు,నిరవధిక సమ్మెలు చేసిన ప్రభుత్వాలు నేటికీ రెగ్యులర్ చేయకపోవడం వలన రోడ్ ఎక్కవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన చెందారు,కాంట్రాక్టు ఏఎన్ఎం లందరు గతంలో రాత పరీక్ష రాసి మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పద్ధతిలో నియమించబడి 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి మళ్లీ రాత పరీక్ష రాయాలని చెప్పడం అత్యంత దుర్మార్గమని,ప్రభుత్వం వెంటనే పునరాలోచించి రాత పరీక్షను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు,రాష్ట్రవ్యాప్తంగాకాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న 6,500 మంది ఏఎన్ఎంలు గతంలో సమ్మె చేసిన సందర్భంగా ఏఎన్ఎంల  న్యాయమైన సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పడిందని,ఆ కమిటీ ఎటూ తేల్చకుండనే ఈ నెల 29న రాత పరీక్ష తేదీని ప్రకటించడం వలన రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పనిచేస్తున్న 6,500 మంది ఏఎన్ఎంలు రోడ్డు ఎక్కారని,వీరందరూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, ప్రభుత్వం సానుభూతితో ఆలోచించి వెంటనే రాత పరీక్షను తాత్కాలికంగానైనా  వాయిదా వేసి ఏఎన్ఎంలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు,లేనియెడల రేపు హైదరాబాదులో జరిగే సమావేశంలో నిరవధిక సమ్మెకు తేదీని ప్రకటించడం జరుగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ నాయకులు నర్మదా,సరోజ చంద్రకళ,ప్రభావతి,సాంబలక్ష్మి,మంజుల,పుష్పలత,విజయ,కవిత,  భాగ్యలక్ష్మి,అనిత,రోజి  తదితరులు పాల్గొన్నారు.